భారీ వర్షాలతో ముద్దయిన ముంబై సిటీ

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. అనేక చోట్ల రోడ్లలో మోకాలి లోతు నీరు నిలిచింది.

  • Umakanth Rao
  • Publish Date - 10:02 am, Wed, 23 September 20
భారీ వర్షాలతో ముద్దయిన ముంబై సిటీ

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. అనేక చోట్ల రోడ్లలో మోకాలి లోతు నీరు నిలిచింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరలేక నానా అవస్థలు పడ్డారు. బుధవారం తెల్లవారు జామువరకు 150 నుంచి 200 మీ.మీ. వర్షపాతం నమోదైనట్టు అంచనా.  పల్లపు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మెట్రో రైలు సర్వీసులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరో 24 గంటలు వర్షాలు తప్పకపోవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. అనేకమంది ఈ వర్షం తాలూకు సీన్లను తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాకు ‘రిలీజ్’ చేశారు.