24 గంట‌ల్లో 83,347 పాజిటివ్ కేసులు

గ‌త‌ నాలుగు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. నిన్న 75 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు 83 వేల‌కుపైగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 56 లక్ష‌లు దాటాయి.

24 గంట‌ల్లో 83,347 పాజిటివ్ కేసులు
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 23, 2020 | 10:01 AM

Positive Cases : దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని సంబరపడేంతలో మళ్లీ పెరుగుతున్నాయి. గ‌త‌ నాలుగు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. నిన్న 75 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు 83 వేల‌కుపైగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 56 లక్ష‌లు దాటాయి.

దేశంలో మంగళవారం నుంచి బుధవారం వరకు 24 గంట‌ల్లో 83,347 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన‌ క‌రోనా కేసుల సంఖ్య 56,46,011కు చేరింది. ఇందులో 45,87,614 మంది బాధితులు కోలుకోగా, 9,68,377 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 1085 మంది బాధితులు క‌రోనాతో మ‌ర‌ణించడంతో మొత్తం మృతులు 90,020కి చేరింది.

దేశంలో నిన్న 9,53,683 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి తాజా కరోనా హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో సెప్టెంబ‌ర్ 22 వ‌ర‌కు మొత్తం 6,62,79,462 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.

అయితే దేశంలో పరీక్షల సామర్థ్యం మాత్రం పెరిగిందని వెల్లడించింది. అయితే ఈ రోజు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.