PM Modi tour of UP: ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఏ నగరానికి వెళ్లిన అభిమానులు ఆయనకు నీరాజనం పడుతుంటారు. వానొచ్చినా, వరదొచ్చినా మోదీని చూసే వెళ్లాలనే మంకు పట్టు పట్టే అభిమానులు కోట్లాది సంఖ్యలో ఉన్నారు. ఇది ఈ రోజు మరో సారి నిరూపితమయింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన ప్రధానికి స్థానిక ప్రజలు వర్షాన్ని లెక్కచేయకుండా స్వాగతం పలికేందుకు తరలి వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని మోదీ శుక్రవారం గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, మరో 29 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. అయితే అంతకముందు నుంచే గోరఖ్‌పూర్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయినా తమ ప్రధానిని స్వాగతించేందుకు ఆ వర్షంలో కూడా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి మరీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని కాన్వాయ్‌పై ఆయన అభిమానుల ఉత్సాహాన్ని తగ్గించడంలో భారీ వర్షాలు విఫలమయ్యాయి.
Rain showers fail to dampen spirits as PM @narendramodi ‘s Gorakhpur road show marches on, with enthusiastic people defying the weather line both sides of the road, showing unwavering support. @PMOIndia @MIB_India @PIB_India pic.twitter.com/csX7jAC8sH
— DD News (@DDNewslive) July 7, 2023
When even heavy rain couldn’t stop people from coming on the roads to welcome PM @narendramodi in Gorakhpur!@PMOIndia @PIB_India pic.twitter.com/rwSGR2GQip
— DD News (@DDNewslive) July 7, 2023
ఇక ప్రధాని మోదీ యూపీ పర్యటన విషయానికొస్తే.. షెడ్యూల్ ప్రకారం వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ పర్యటనలో భాగంగా 2 వందే భారత్ రైళ్ల(గోరఖ్‌పూర్-లక్నో.., జోధాపూర్-అహ్మదాబాద్)ను జెండా ఊపి ప్రారంభించారు. ఇంకా ఉత్తరప్రదేశ్‌లోని రెండు తూర్పు జిల్లాల్లో రూ. 12,100 కోట్ల విలువైన 29 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ఆయన తన పార్లమెంటరీ నియోజకవర్గం అయిన వారణాసిలో, బీజేపీ కార్యకర్తలతో ‘టిఫిన్ మీటింగ్’లో పాల్గొని, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బూత్ స్థాయిలో పార్టీ సంస్థను బలోపేతం చేయడంలో వారికి దిశానిర్దేశం చేశారు.
అనంతరం గోరఖ్‌పూర్‌లో మధ్యాహ్నం జరిగిన గీత ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో కూడా మోదీ హాజరయ్యారు. కాగా, అంతకముందు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి గోరఖ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఉత్తరప్రదేశ్ సీఏం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..