Heart Attack: ఆగిన మరో గుప్పెడంత గుండె.. ఓ ఈవెంట్‌లో డాన్స్‌ చేస్తూ కుప్పకూలిన ప్రభుత్వ ఉద్యోగి

తపాలా శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే సురేంద్ర కుమార్‌ దీక్షిత్‌ అనే వ్యక్తి 'బస్ ఆజ్ కి రాత్ హై జిందగీ' అనే ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు

Heart Attack: ఆగిన మరో గుప్పెడంత గుండె.. ఓ ఈవెంట్‌లో డాన్స్‌ చేస్తూ కుప్పకూలిన ప్రభుత్వ ఉద్యోగి
Mana Dies With Heart Attack
Follow us
Surya Kala

|

Updated on: Mar 21, 2023 | 9:44 AM

గత కొంతకాలంగా వయసుతో సంబంధం లేకుండా సెలబ్రెటీలు, సామాన్యులు సైతం హఠాత్తుగా కుప్పకూలుతున్నారు. హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. గత కొంతకాలంగా సడెన్‌ హార్ట్‌ఎటాక్‌లు జనాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో నేలరాలుతున్నారు. అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపినవారే మరుక్షణంలో నిర్జీవంగా మారిపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే..

తపాలా శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసే సురేంద్ర కుమార్‌ దీక్షిత్‌ అనే వ్యక్తి ‘బస్ ఆజ్ కి రాత్ హై జిందగీ’ అనే ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు సడెన్‌గా గుండెపోటు రావడం వల్లే మృతిచెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన స్నేహితులతో కలిసి ఓ పాటకు డ్యాన్స్‌ చేస్తూ ఎంతో ఉత్సాహంగా గడిపిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. స్నేహితులు ఆయనను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ఇవి కూడా చదవండి

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ మార్చి 13 నుంచి 17వరకు 34వ ఆల్‌ ఇండియా పోస్టల్‌ హాకీ టోర్నమెంట్‌ను భోపాల్‌లోని మేజర్‌ ధ్యాన్‌చంద్‌ హాకీ స్టేడియంలో నిర్వహించింది. మ్యాచ్‌ మార్చి 17న ఆఖరి మ్యాచ్‌. అయితే ముందు రోజు మార్చి 16న ఆఫీసు ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఓ పాటకు తోటి ఉద్యోగులతో కలిసి డాన్స్‌ చేసిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..