HDFC Bank Customers Alert: ఆ బ్యాంక్ వినియోగదారులకు అలెర్ట్: నేడు, రేపు కొన్ని గంటల పాటు సేవలకు అంతరాయం.. వివరాల్లోకి వెళ్తే..
దేశంలోని ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్ధ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు కీలక సమాచారాన్ని అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఖాతాదారులకు రెండు రోజులపాటు కొన్ని బ్యాంకింగ్ సేవలు...

HDFC Bank Customers Alert: దేశంలోని ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్ధ హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు కీలక సమాచారాన్ని అందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఖాతాదారులకు రెండు రోజులపాటు కొన్ని బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని ఎస్ఎంఎస్ ద్వారా పంపించింది. . షెడ్యూల్ నిర్వహణ కారణంగా ఫిబ్రవరి 4, 5 తేదీలలో ఆన్‌లైన్ డిజిటల్ లావాదేవీలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవని తన వినియోగదారులకు నోటిఫికేషన్ జారీ ద్వారా తెలిపింది. దీంతో ఈరోజు, రేపు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడనుంది.
క్రెడిట్ కార్డు కు సంబంధించిన సేవలు ఈరోజు ఉదయం ఉదయం 2 నుండి 3 గంటల వరకు అందుబాటులో ఉండవని తెలిపింది. అదే విధంగా డెబిట్ కార్డుకు సంబంధించిన సేవలు రేపు ఉదయం 12:30 నుండి ఉదయం 5 గంటల వరకు పనిచేయవని ప్రకటించింది. ఈ రెండు సర్వీసులు ఇంటర్ నెట్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ లో అందుబాటులో ఉండవని తన ఖాతాదారులకు మెసేజ్ ను పంపించింది.
Also Read: