Rohingya Immigrants: దేశంలోని 12 రాష్ట్రాల్లో రోహింగ్యాలు… ప్రకటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…
దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోహింగ్యాలు నివసిస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది...
దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోహింగ్యాలు నివసిస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఢిల్లీ, తెలంగాణ, యూపీ, పశ్చిమబెంగాల్, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్ రాజ్యసభకు తెలిపారు. సరైన పత్రాలు లేకుండానే అక్రమ పద్ధతుల్లో వీరంతా దేశంలోకి ప్రవేశించినట్టు పేర్కొన్నారు. అక్రమ వలసదారులకు సంబంధించి 2014 ఏప్రిల్, 2019 జులై 1న రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచనలు జారీచేసినట్టు పేర్కొన్నారు.
కేంద్ర నివేదికలు…
దేశంలో ఎంత మంది రోహింగ్యాలున్నారని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, దేశంలో ఎంత మంది అక్రమంగా ఉంటున్నారన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదన్నారు. కేంద్ర నివేదికల ప్రకారం.. రోహింగ్యాలు, అక్రమ వలసదారులు ఎక్కువగా జమ్మూకశ్మీర్, తెలంగాణ, పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉంటున్నట్టు మంత్రి వివరించారు. వీరందరినీ గుర్తించి, దేశం నుంచి పంపడం వారి జాతీయతను ధ్రువీకరించే ప్రక్రియ తర్వాతే నిరంతరంగా సాగుతుందని తెలిపారు.
Also Read: