#WATCH: వాటర్ అనుకొని శానిటైజర్ తాగిన బీఎంసీ జాయింట్ కమిషనర్.. ఆ తర్వాత ఏమైందంటే..? వీడియో వైరల్
దేశంలోని అతిపెద్ద మునిసపల్ కార్పోరేషన్‌కు ఆయనొక జాయింట్ కమిషనర్.. మీటింగ్‌కు ముందు ఆయన వాటర్ బాటిల్ అనుకొని.. శానిటైజర్‌ను తాగారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్...
accidentally drinks sanitiser: దేశంలోని అతిపెద్ద మునిసపల్ కార్పోరేషన్‌కు ఆయనొక జాయింట్ కమిషనర్.. మీటింగ్‌కు ముందు ఆయన వాటర్ బాటిల్ అనుకొని.. శానిటైజర్‌ను తాగారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని ముంబై మునిసిపల్ కార్పోరేషన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం బుధవారం జరిగింది. ఈ క్రమంలో ప్రసంగానికి ముందు బీఎంసీ జాయింట్ కమిషనర్ రమేష్ పవార్.. వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్‌ను తాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పవార్ వాటర్ బాటిల్ అనుకుని వేదికపై ఉన్న శానిటైజర్‌ను తీసుకుని కొద్దిగా తాగారు. వెంటనే అది శానిటైజర్ అని పసిగట్టిన పవార్ ఆ బాటిల్‌ను పక్కన బెట్టారు. వెంటనే వాటర్ బాటిల్ అందుకొని పక్కకు వెళ్లి నోటిని శుభ్రం చేసుకున్నారు.
#WATCH: BMC Joint Municipal Commissioner Ramesh Pawar accidentally drinks from a bottle of hand sanitiser, instead of a bottle of water, during the presentation of Budget in Mumbai. pic.twitter.com/MuUfpu8wGT
— ANI (@ANI) February 3, 2021
దీనిపై మాట్లాడిన రమేష్ పవార్… తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు నీళ్లు తాగాలని అనుకున్నానని.. కానీ అక్కడ ఉంచిన వాటర్, శానిటైజర్ బాటిల్స్ రెండూ కూడా ఒకేలా ఉన్నాయన్నారు. గమనించక శానిటైజర్‌ను తాగానని.. వెంటనే పొరపాటును గ్రహించానని తెలిపారు.
Also Read:
#WATCH: కిసాన్ మహాపంచాయత్‌లో కుప్పకూలిన స్టేజీ.. బీకేయూ నేత తికాయత్‌కు స్వల్పగాయాలు.. వీడియో
Farmers Protest: అలా చేయకపోతే చర్యలు తప్పవు.. ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..