పొలిటికల్ స్ట్రాటజీలో కాంగ్రెస్ వెనకబడిందా.?

పొలిటికల్ స్ట్రాటజీలో కాంగ్రెస్ వెనకబడిందా.?

రాజకీయ వ్యూహాలను రచించడంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకి వెనకబడుతోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశంలో మోదీ హవా ముందు కాంగ్రెస్ వ్యూహాలన్నీ విఫలమవుతున్నాయని చెప్పొచ్చు. దీనికి తగ్గట్టుగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చప్పగా సాగింది. ఆ పార్టీ గెలవడం మాట అటుంచితే.. అసలు ఇప్పుడు పోటీనిచ్చే అవకాశమే కనిపించట్లేదని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎక్కడా కనిపించట్లేదు.. ఇక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అయితే ఎక్కడికి […]

Ravi Kiran

|

Oct 20, 2019 | 1:54 PM

రాజకీయ వ్యూహాలను రచించడంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకి వెనకబడుతోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశంలో మోదీ హవా ముందు కాంగ్రెస్ వ్యూహాలన్నీ విఫలమవుతున్నాయని చెప్పొచ్చు. దీనికి తగ్గట్టుగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చప్పగా సాగింది. ఆ పార్టీ గెలవడం మాట అటుంచితే.. అసలు ఇప్పుడు పోటీనిచ్చే అవకాశమే కనిపించట్లేదని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎక్కడా కనిపించట్లేదు.. ఇక ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అయితే ఎక్కడికి రావట్లేదు. ఇకపోతే పార్టీ సీనియర్ నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పెద్దగా ప్రభావం చూపించకపోవడం గమనార్హం. అంతో ఇంతో చెప్పాలంటే కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని త్యజించిన రాహుల్ గాంధీ మాత్రం పార్టీ గెలుపు కోసం తిప్పలు పడుతున్నాడు.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మరోసారి తన అపరిపకత్వను మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా బయటపెట్టారు. నాటి లోక్‌‌సభ ఎన్నికల వేళ మోదీ సర్కారు రఫెల్, జీఎస్టీ నోట్ల రద్దును ప్రస్తావించిన రాహుల్.. తాజాగా అవే ఆరోపణలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తావించడం కాంగ్రెస్‌ను మరింతగా కృంగదీస్తోంది. మరోవైపు రఫెల్ యుద్ధ విమానంపై ‘ఓం’ రాశారంటూ కేంద్ర రక్షణమంత్రిని రాహుల్ గాంధీ నిలదీయడం కూడా కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. ముఖ్యంగా హిందువుల ఓట్లు ఆ పార్టీకి పడకుండా పోయాయన్న చర్చ జరుగుతోంది.

ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ పెద్దలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రచారం చప్పగా సాగుతోందనే టాక్ నడుస్తోంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో యాక్టివ్‌గా ఉన్న ప్రియాంక.. ఈసారి ఎందుకు సైలెంట్ అయ్యారనేది కాంగ్రెస్ నేతలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

పార్టీ అన్నాక గెలుపోటములు సహజం. గెలిచినా.. ఓడినా ప్రజలకు, పార్టీ శ్రేణులకు అండగా నిలిచుకున్న వాడే నిజమైన నాయకుడు. దీనికి తగిన ఉదాహరణ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని భావించవచ్చు. దాదాపు తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉండి.. ప్రజలకు దగ్గరవుతూ.. కష్టసమయంలో పార్టీని ముందుండి నడిపించిన జగన్.. ఇప్పుడు సీఎంగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాంటిది ఐదేళ్లకే కాంగ్రెస్ రాజకీయ సన్యాసం తీసుకుంటే.. మున్ముందు ఆ పార్టీ కోలుకోవడం కష్టతరమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu