Haryana Politics: హర్యానా రాజకీయ సంక్షోభం.. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తు దాదాపుగా తెగిపోయింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. కొత్త ప్రభుత్వంలో బీజేపీ సంజయ్ భాటియాను ముఖ్యమంత్రిని, నాయబ్ సైనీని ఉప ముఖ్యమంత్రిని చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Haryana Politics: హర్యానా రాజకీయ సంక్షోభం.. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
Haryana Political Crisis
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 12, 2024 | 12:43 PM

లోక్ సభ ఎన్నికలకు ముందు కీలక పరిణామం. హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తు దాదాపుగా తెగిపోయింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. కొత్త ప్రభుత్వంలో బీజేపీ సంజయ్ భాటియాను ముఖ్యమంత్రిని, నాయబ్ సైనీని ఉప ముఖ్యమంత్రిని చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. మార్చి 12న ఉదయం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు రాజీనామా సమర్పించారు. ఆయన బాటలోనే కేబినెట్ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుశ్యంత్ చౌతాలా సారధ్యంలోని జేజేపీతో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు రావడం ఈ పరిస్థితికి దారి తీసింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో బీజేపీ ఉంది. సీఎం, కేబినెట్ మొత్తం రాజీనామా చేశారని, వారి రాజీనామాను గవర్నర్ ఆమోదించారని బీజేపీ నేత కన్వర్ పాల్ గుర్జార్ తెలిపారు.

దుష్యంత్ చౌతాలా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 2 సీట్లు డిమాండ్ చేస్తోంది. ఒక్క సీటు ఇస్తే అంగీకరించేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. కానీ దుష్యంత్ మాత్రం 2 సీట్లపై పట్టుదలగా ఉన్నారు. అయితే అన్ని స్థానాల్లో ఎంపీలు ఉన్నందున 10 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు పార్టీల పొత్తు తెగిపోయింది. మరోవైపు కర్నాల్‌ నుంచి లోక్‌సభకు మనోహర్ ఖట్టర్‌ పోటీచేసే అవకాశం ఉంది. కాగా, హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా 40 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..