ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకున్న హర్యానా ప్రభుత్వ అధికారి : డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

హర్యానాలోని ఫరీదాబాద్ లో గల  ఆక్సిజన్ ప్లాంట్ నుంచి  తమ ఢిల్లీ కి ఆక్సిజన్ రాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు అడ్డుకున్నారని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.

ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకున్న హర్యానా ప్రభుత్వ అధికారి : డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా
Haryana Official Stopped Oxygen Supply To Delhi Says Deputy Cm Manish Sisodia
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Apr 22, 2021 | 11:51 AM

హర్యానాలోని ఫరీదాబాద్ లో గల  ఆక్సిజన్ ప్లాంట్ నుంచి  తమ ఢిల్లీ కి ఆక్సిజన్ రాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు అడ్డుకున్నారని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అసలే తమ నగరంలోని పలు ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని ఆయన చెప్పారు. హర్యానా అధికారి తీరును ఆయన తప్పు పట్టారు. తమ నగరానికి ఆక్సిజన్ కోటాను 378 మెట్రిక్ టన్నులనుంచి 700 మెట్రిక్ టన్నులకు పెంచాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. యూపీ, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఢిల్లీ ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఆయన తెలిపారు. తమ నగరానికి ఆక్సిజన్ అందకుండా చూసేందుకు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ అధికారి కూడా యత్నించారని,దీంతో కొన్ని ఆసుపత్రుల్లో సంక్షోభం తలెత్తిందని మనీష్ సిసోడియా తెలిపారు. చివరకు అతి కష్టంమీద ఆక్సిజన్ సరఫరాను పునరుధ్ధ రించారని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్  సమానంగా అందాల్సి ఉందని, కేంద్రం కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. అయితే ముఖ్యంగా ఆక్సిజన్ కొరత ఉన్న  రాష్ట్రాల పరిస్థితిని కేంద్రం గమనించాలని ఆయన సూచించారు.

ముఖ్యంగా హర్యానా నుంచి తమ రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోకుండా చూడాలని  సిసోడియా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాగా-మనీష్ సిసోడియా ఆరోపణపై హర్యానా ప్రభుత్వం స్పందించలేదు.  ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతను ఢిల్లీలోని పలు ఆసుపత్రులు తప్పు పట్టాయి.  ఢిల్లీ నగరంలో పెరిగిపోతున్న కోవిడ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని  హర్యానా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఢిల్లీ ప్రభుత్వంతో బాటు ఈ ఆసుపత్రులు కూడా కోరుతున్నాయి. గంటగంటకూ తమ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత పెరిగిపోతోందని పలు ఆసుపత్రులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక చిన్న హాస్పిటల్స్ అయితే అప్పుడే చేతులెత్తేశాయి. మరిన్ని చదవండి ఇక్కడ : పిల్లల కోసం మహీంద్రా జీప్.. కేరళ వ్వక్తి నైపుణ్యం ఆడుకోడానికి జీప్ తయారీ వైరల్ అవుతున్న వీడియో :Mahindra jeep for kids.

New Covid Symptoms:ఈ ఐదు మెయిన్ కోవిడ్ లక్షణాలు… క్రిటికల్ సిట్యూషన్స్ వీడియో.. అత్యంత ప్రమాదకరంగా కొత్త కరోనా