AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హర్యానా మోడల్ దారుణ హత్య.. కాలువలో కనిపించిన మృతదేహం..

జూన్‌ 15 ఆదివారం రాత్రి శీతల్‌ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. సోనిపట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం పంపారు. స్థానిక సివిల్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం పంపారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

హర్యానా మోడల్ దారుణ హత్య.. కాలువలో కనిపించిన మృతదేహం..
Model Sheetal Murder
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2025 | 6:38 PM

Share

హర్యానాలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మోడల్ శీతల్‌ అలియాస్‌ సిమ్మీ చౌదరి శవమై కనిపించింది. హర్యానాలోని సోనిపట్‌లోని ఖార్ఖోడా ప్రాంతంలో శీతల్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. దుండగులు శీతల్‌ని గొంతు కోసి చంపారు. ఖండా గ్రామానికి సమీపంలోని ఓ కాలువలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె చేతులు, ఛాతీపై ఉన్న పచ్చబొట్లు ఆధారంగా ఆమెను పోలీసులు గుర్తించారు. శీతల్ హర్యాన్వి మ్యూజిక్ వీడియోలలో పనిచేసేది. ఆమె తన సోదరి నేహాతో కలిసి ఖలీలా మజ్రాలో నివసిస్తోంది.

ఈ క్రమంలోనే జూన్‌ 14న మ్యూజిక్‌ వీడియో షూట్‌ కోసం అహర్‌ గ్రామానికి వెళ్లింది. ఇంటికి తిరిగి రాలేదని శీతల్ సోదరి నేహా గతంలో పానిపట్‌లోని మట్లౌడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జూన్‌ 15 ఆదివారం రాత్రి శీతల్‌ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. సోనిపట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం పంపారు. స్థానిక సివిల్ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం పంపారు. హత్య వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

అయితే, జూన్ 14న షూటింగ్ కోసం ఇంటి నుండి వెళ్లిన శీతల్‌ను అక్కడ ఆమె ప్రియుడు కలిసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతడే తమ కుమార్తెపై దాడి చేశాడని ఆరోపించారు. శీతల్‌ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..