AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతు సుడి తిరిగింది.. ఆరు నెలల కష్టం.. ఒక్కరోజులోనే లక్షాధికారిని చేసింది..!

వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ మాట్లాడుతూ, ఆ వజ్రం ప్రకాశవంతమైన నాణ్యత కలిగి ఉందని చెప్పారు. ఈ సంవత్సరం మొత్తం 19 వజ్రాలు డైమండ్ వర్క్‌ప్లేస్‌లో డిపాజిట్ చేసినట్టుగా చెప్పారు. వీటి బరువు 45.35 క్యారెట్లుగా వెల్లడించారు. అవన్నీ రాబోయే వేలంలో అమ్మకానికి ఉంచుతామని చెప్పారు.. రాబోయే వేలం తేదీని నిర్ణయించి ప్రకటిస్తారని చెప్పారు.

రైతు సుడి తిరిగింది.. ఆరు నెలల కష్టం.. ఒక్కరోజులోనే లక్షాధికారిని చేసింది..!
Diamond
Jyothi Gadda
|

Updated on: Jun 16, 2025 | 5:29 PM

Share

మధ్యప్రదేశ్‌లో ఓ రైతు సుడి తిరిగింది. రత్నాలతో నిండిన పన్నా భూమి మరోసారి కొత్త వజ్రాన్ని ఉత్పత్తి చేసింది. ఇది ఆ రైతు అదృష్టాన్ని మార్చేసింది. దెబ్బతో అతడు రాత్రికిరాత్రే లక్షాధికారి అయిపోయాడు. పన్నాలోని లీజుకు తీసుకున్న గనిలో 3.01 క్యారెట్ల నాణ్యమైన వజ్రాన్ని ఓ రైతు కనుగొన్నాడు. అతడు వజ్రాన్ని పన్నా వజ్ర కార్యాలయంలో డిపాజిట్ చేశాడు. వజ్రం ఖరీదు ధర రూ. 8 నుండి రూ.10 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇది రాబోయే వేలంలో అమ్మకానికి పెడతారు.

ఈ సందర్బంగా వజ్రాన్ని కనుగొన్న రైతు రాకేష్ గిరి గోస్వామి మాట్లాడుతూ.. వజ్రం వేలం వేయగా వచ్చిన డబ్బుతో నలుగురు భాగస్వాములం సమానంగా పంచుకుంటామని చెప్పాడు. దాదాపు 6 నెలల క్రితం సర్కోహా గ్రామంలోని ఆకాష్ రైక్వార్ పొలంలో లీజుకు తీసుకొని గనిని తవ్వానని చెప్పారు. ఈ గనిలో ఆయనకు నలుగురు భాగస్వాములు ఉన్నారు. 6 నెలలు కష్టపడి పనిచేసిన తర్వాత నేడు ఒక వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని డైమండ్ వర్క్‌ప్లేస్‌లో డిపాజిట్ చేశామని చెప్పాడు. భాగస్వాముల్లో రాజు జైన్, రాజేష్ శర్మ, రాజేంద్ర, రాకేష్ గిరి గోస్వామి ఉన్నారు.

వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ మాట్లాడుతూ, ఆ వజ్రం ప్రకాశవంతమైన నాణ్యత కలిగి ఉందని చెప్పారు. ఈ సంవత్సరం మొత్తం 19 వజ్రాలు డైమండ్ వర్క్‌ప్లేస్‌లో డిపాజిట్ చేసినట్టుగా చెప్పారు. వీటి బరువు 45.35 క్యారెట్లుగా వెల్లడించారు. అవన్నీ రాబోయే వేలంలో అమ్మకానికి ఉంచుతామని చెప్పారు.. రాబోయే వేలం తేదీని నిర్ణయించి ప్రకటిస్తారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..