Viral Video: చెట్టు మీది నుంచి నోట్ల వర్షం కురిపించిన కోతి… ఆ రూ.500 నోట్ల కట్ట ఎవరిద పాపం…
బృందావనంలో కోతుల దోపిడీ గురించి మీరు వినే ఉంటారు. భక్తుల నుండి వస్తువులను లాక్కొని పరేషాన్ చేస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కొడైకెనాల్‌లో ఈ సంఘటన జరిగినట్లు...

బృందావనంలో కోతుల దోపిడీ గురించి మీరు వినే ఉంటారు. భక్తుల నుండి వస్తువులను లాక్కొని పరేషాన్ చేస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం కొడైకెనాల్‌లో ఈ సంఘటన జరిగినట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది అక్కడ కోతి ఒక పర్యాటకుడి చేతిలో నుండి 500 రూపాయల నోట్ల కట్టను లాక్కోవడమే కాకుండా, ఒక చెట్టు ఎక్కి డబ్బును కూడా విసిరేసింది.
ఈ సంఘటన కొడైకెనాల్‌లోని గుణ గుహల దగ్గర జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తికి ఈ వింత సంఘటన జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో, చెట్టుపై కూర్చున్న కోతిని మీరు చూడవచ్చు. దాని చేతిలో 500 రూపాయల నోట్ల కట్ట ఉంది. దానికి రబ్బర్ బ్యాండ్ వేసి ఉంది. కోతి నోట్ల కట్ట నుండి ఒక్కో నోటును తీసి చెట్టు మీది నుండి పడవేయడం ప్రారంభిస్తుంది మరియు కొన్ని సెకన్లలో అన్ని నోట్లను పడేస్తుంది.
వీడియో ప్రారంభంలో, చెట్టుపై కూర్చున్న కోతి నోట్ల కట్ట నుండి హాయిగా నోట్లు తీస్తున్నట్లు కనిపిస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత అది వెనక్కి తిరిగింది. బహుశా ఎవరో తనను రహస్యంగా రికార్డ్ చేస్తున్నారని అది గ్రహించి ఉండవచ్చు. ఈ వీడియోపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కోతులు పర్యాటకుల నుంచి డబ్బులు లాక్కోవడం ఇదేమీ తొలిసారి కాదంటున్నారు అక్కడికి వెళ్లివచ్చిన పర్యాటకులు.
వీడియో చూడండి
लूट कर नोट लूटाता बंदर
बंदर ने पर्यटक से 500 नोट के बंडल छीने और पेड़ पर चढ़कर लूटाने लगा
कर्नाटक गुना गुफाओं के का वीडियो सोशल मीडिया पर वायरल #ViralVideos#monkeylife # pic.twitter.com/KFUdf59jau
— jagmohan shakaal (@shakaalbaba) June 16, 2025
