ప్రైవేటు రంగంలో 75 శాతం రిజర్వేషన్లు, బిల్లుకు హర్యానా గవర్నర్ ఆమోదం, పదేళ్ల చెల్లుబాటు
ప్రైవేటు రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆమోద ముద్ర వేశారు. గత ఏడాది ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.
ప్రైవేటు రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుకు హర్యానా గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆమోద ముద్ర వేశారు. గత ఏడాది ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటు రంగంలో ఇంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ మిత్ర పక్షమైన దుశ్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన నాయక్ జనతా పార్టీ లోగడ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. త్వరలో ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అవుతుందని ఆయన చెప్పారు. ది హర్యానా స్టేట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ బిల్-2020 పేరిట ఈ బిల్లును వ్యవహరిస్తున్నారు. స్థానిక యువతకు ప్రైవేటు రంగంలో నెలకు 50 వేల రూపాయల లోపు వేతనం ఇవ్వడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ కోటాను మొదట 10 ఏళ్లపాటు వర్తింపజేయనున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వఛ్చి ఇక్కడ తక్కువ వేతనాలతో పని చేయగోరే వారికి ఇక వీలు ఉండదని, ఇలాంటి వారి వల్ల రాష్ట్రంలో స్లమ్స్ పెరిగిపోతాయని భావిస్తున్నామని జన నాయక్ జనతా పార్టీ నేతలు అంటున్నారు. ప్రైవేటు కంపెనీలు, సొసైటీలు, ట్రస్టులు, ప్రభుత్వంతో భాగస్వామ్యం వహిస్తున్న సంస్థలను ఈ బిల్లు పరిధిలో చేర్చినట్టు వారు చెప్పారు. క్వాలిఫై అభ్యర్థులు లభించనప్పుడు అర్హత గల స్థానిక యువతకు శిక్షణ ఇఛ్చి ఉద్యోగాల్లో తీసుకునేందుకు కూడా ఈ తాజా బిల్లు వీలు కల్పిస్తుందన్నారు. డామిసైల్ అర్హత పొందిన అభ్యర్థులు హర్యానాలో కనీసం 15 ఏళ్ళు నివసించాలన్న నిబంధనను ఇందులో చేర్చారు. కాగా గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయడం పట్ల డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా హర్షం వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఇది మంచి అవకాశమని ఆయన అన్నారు. ఎన్నికల ముందు తమ పార్టీ మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ :