AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: రైలులో కొడుకుతో కలిసి ప్రయాణిస్తున్న మహిళపై కామాంధుడి కన్ను.. ప్రతిఘటించడంతో దారుణం..

ఆ సమయంలో ఆమె తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫతేబాద్‌లోని తోహానా పట్టణంలో రైలు స్టేషన్‌లోకి ప్రవేశించగానే..

Crime News: రైలులో కొడుకుతో కలిసి ప్రయాణిస్తున్న మహిళపై కామాంధుడి కన్ను.. ప్రతిఘటించడంతో దారుణం..
Haryana Fatehbad Incident
Shaik Madar Saheb
|

Updated on: Sep 02, 2022 | 7:33 PM

Share

Haryana Fatehbad incident: ఆమె.. కొడుకుతో కలిసి భర్తను కలిసేందుకు రైలులో ప్రయాణిస్తోంది.. ఈ సమయంలో రైలు కోచ్‌లో ఎవరూ లేకపోవడంతో.. ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు.. ఆమెపై బలాత్కారానికి ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెను రైలు నుంచి కిందకు తోసేశాడు. అనంతరం అతను కూడా కిందకు దూకాడు.. ఈ ఘోర సంఘటన హర్యానాలోని ఫతేబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ట్రైన్‌లో వేధింపులకు ప్రయత్నించిన వ్యక్తిని ప్రతిఘటించడంతో 30 ఏళ్ల మహిళను రైలు నుంచి కిందకు తోసేసి చంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఆమె తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫతేబాద్‌లోని తోహానా పట్టణంలో రైలు స్టేషన్‌లోకి ప్రవేశించగానే.. ఆ చిన్నారి ఏడుస్తూ తన తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సమయంలో ముగ్గురు ప్రయాణికులు మినహా కోచ్ మొత్తం ఖాళీగా ఉందని ఫతేబాద్ పోలీసు చీఫ్ అస్తా మోడీ విలేకరులకు తెలిపారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను చూసిన నిందితుడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించగా, ఆమె ఎదురు తిరిగింది. దీంతో ఆ వ్యక్తి తన తల్లిని రైలు నుంచి బయటకు నెట్టి తానూ దూకాడని కొడుకు పోలీసులకు తెలిపాడు.

ట్రైన్ స్టేషన్‌లో ఆగగానే.. కొడుకు ఏడుస్తూ తన దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడని.. ఒక వ్యక్తి తన తల్లిని రైలు నుంచి కిందకు నెట్టాడని చెప్పినట్లు భర్త తెలిపాడు. 20 కి.మీ దూరంలో ఉన్నపుడు తన భార్య మొబైల్‌కి కాల్ చేసి స్టేషన్‌కి వచ్చి పికప్ చేసుకోమని చెప్పిందని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ భర్త వాపోయాడు.

ఇవి కూడా చదవండి

కాగా.. దూకడంతో నిందితుడికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్ (27) అనే నిందితుడిని గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడిని అరెస్టు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆమె గత కొన్ని రోజులుగా రోహ్‌తక్‌లో ఉంటోంది. గురువారం రాత్రి 145 కిలోమీటర్ల దూరంలోని తోహానాకు తిరిగి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తుండగా.. ఈ ఘోరం జరిగింది. పోలీసులు, మహిళ కుటుంబ సభ్యులు బాధిత మహిళ మృతదేహం కోసం రైల్వే ట్రాక్ వెంబడి అర్ధరాత్రి వరకు వెతికారు. కానీ.. ఆమె ఆచూకీ లభించలేదు.. ఉదయాన్ని ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.

రాత్రి వేళల్లో రైల్వే పోలీసులు కోచ్‌లపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. అయితే.. ఏమైనా భద్రతా లోపం జరిగిందా..? పోలీసులు ఏం చేస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తోహానా రైల్వే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ జగదీష్ వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ