Muruga Mutt: లైంగిక వేధింపుల కేసులో.. లింగాయత్ మఠాధిపతికి 4 రోజుల పోలీసు కస్టడీ..

గురువారం రాత్రి స్వామీజీని అరెస్ట్‌ చేసిన తరువాత నేరుగా ఆస్పత్రికి వీల్‌చైర్‌లో తరలించడంపై విమర్శలు వెలువెత్తాయి. మెడికల్‌ రిపోర్ట్‌పై విమర్శలు రావడంతో స్వామీజీని హాజరుపర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Muruga Mutt: లైంగిక వేధింపుల కేసులో.. లింగాయత్ మఠాధిపతికి 4 రోజుల పోలీసు కస్టడీ..
Shivamurthy Murugha Sharanaru
Follow us

|

Updated on: Sep 02, 2022 | 6:41 PM

Shivamurthy Murugha Sharanaru: చిత్రదుర్గలోని లింగాయత్‌ ఆశ్రమంలో మైనర్‌ బాలికలపై రేప్‌ కేసులో శివమూర్తి మురుగ శరణారు స్వామీజీకి న్యాయస్థానం నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వామీజీని కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. శివమూర్తి స్వామీజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. స్వామీజీ మెడికల్‌ రిపోర్ట్‌పై కూడా కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లోనే స్వామీజీకి హాస్పిటల్‌లో చికిత్సను అందించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గురువారం రాత్రి స్వామీజీని అరెస్ట్‌ చేసిన తరువాత నేరుగా ఆస్పత్రికి వీల్‌చైర్‌లో తరలించడంపై విమర్శలు వెలువెత్తాయి. మెడికల్‌ రిపోర్ట్‌పై విమర్శలు రావడంతో స్వామీజీని హాజరుపర్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్వామిజీని కోర్టులో హాజరుపర్చగా.. నాలుగురోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో శివమూర్తి స్వామీజీని పోలీసులు బెంగళూర్‌కు తరలించి విచారించే అవకాశాలున్నాయి.

కాగా.. మఠంలో తమపై అత్యాచారం జరిగిందని బాధిత బాలికలు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మఠం నడుపుతున్న పాఠశాలలో చదువుతున్న 15, 16 ఏళ్ల బాలికలపై మూడురేళ్లకుపైగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఆశీర్వాదం పేరుతో శివమూర్తి స్వామి ప్రతివారం పిలిపించి లైంగికంగా వేధించేవాడని ఇద్దరు బాలికలు ఆరోపించారు. అనంతరం ఈ ఘటనపై పలు పార్టీలు, సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. దీంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ కేసులో మఠాధిపతి, హాస్టల్ వార్డెన్‌తో సహా మొత్తం ఐదుగురు నిందితులుగా ఉన్నారు. స్వామీజీని అరెస్ట్ చేయడానికి ముందు ఈ కేసులో హాస్టల్ వార్డెన్ రష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సున్నితమైన అంశం కావడంతో చిత్రదుర్గలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, అదనపు బలగాలను రప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..