హర్యానా పోలింగ్ తేదీతోపాటు.. జమ్మూ కాశ్మీర్ ఫలితాల తేదీలో మార్పు..! వారి కోసమేనా..?

భారత ఎన్నికల సంఘం హర్యానాలో ఎన్నికల తేదీలో మార్పులు చేసింది. అక్టోబర్ 1 కి బదులు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. బిష్ణోయ్ కమ్యూనిటీ ఓటింగ్ హక్కులు, సంప్రదాయాలు రెండింటినీ గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది.

హర్యానా పోలింగ్ తేదీతోపాటు.. జమ్మూ కాశ్మీర్ ఫలితాల తేదీలో మార్పు..! వారి కోసమేనా..?
Election Commission Of India
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 31, 2024 | 8:29 PM

భారత ఎన్నికల సంఘం హర్యానాలో ఎన్నికల తేదీలో మార్పులు చేసింది. అక్టోబర్ 1 కి బదులు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. బిష్ణోయ్ కమ్యూనిటీ ఓటింగ్ హక్కులు, సంప్రదాయాలు రెండింటినీ గౌరవించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే జమ్మూ కాశ్మీర్, హర్యానా ఫలితాల తేదీ కూడా మార్చులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 1న జరగనున్న జమ్మూకశ్మీర్ మూడో దశ ఎన్నికల ఓటింగ్ తేదీలో ఎలాంటి మార్పు లేదు. జమ్మూ కాశ్మీర్, హర్యానా రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.

ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఎన్నికల తేదీకి ముందు, తర్వాత సెలవుల కారణంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్‌కు లేఖలు అందాయి ఈ నేపథ్యంలోనే పోలింగ్ తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది.

బిష్ణోయ్‌ కమ్యూనిటీ మూలపురుషుడు గురు జంబేశ్వర్‌ స్మారకంగా అసోజ్‌ అమవాస్య పండగను ఘనంగా నిర్వహిస్తారు. అక్టోబర్‌ 2న జరిగే ఈ వేడుకలో హర్యానాతోపాటు, పంజాబ్‌, రాజస్థాన్‌కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ క్రమంలో తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..