Cyclone Asna: ఆకాశానికి చిల్లు పడిందా..? కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా వరుణుడి ప్రతాపం..!

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారిదాకా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఓ వైపు తుఫాన్, మరోవైపు వాయుగుండం. కంటిన్యూగా కుమ్మేస్తున్నాడు వరుణుడు. గుజరాత్‌ చిగురుటాకులా వణికిపోతోంది. అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్‌తో కుంభవృష్టి కురుస్తోంది.

Cyclone Asna: ఆకాశానికి చిల్లు పడిందా..? కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా వరుణుడి ప్రతాపం..!
Weather Report
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 31, 2024 | 7:54 PM

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారిదాకా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఓ వైపు తుఫాన్, మరోవైపు వాయుగుండం. కంటిన్యూగా కుమ్మేస్తున్నాడు వరుణుడు. గుజరాత్‌ చిగురుటాకులా వణికిపోతోంది. అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్‌తో కుంభవృష్టి కురుస్తోంది. అరేబియా సముద్రంలో 48ఏళ్ల తర్వాత ఏర్పడ్డ తుఫాన్‌గా.. తీరప్రాంతాల్ని అస్నా హడలెత్తిస్తోంది. కొన్ని రాష్ట్రాలను సెప్టెంబరు 5దాకా వరదగండం వెంటాడబోతోంది.

అస్నా. పాకిస్తాన్‌ సూచించిన పేరిది. 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫాన్‌ ఇదే. కచ్‌ తీరం మీదుగా ఆవరించిన అస్నా తుపాను ఒమన్‌ దిశగా అరేబియా సముద్రంలో కదిలింది. గుజరాత్‌లో కుండపోత వర్షాలు, వరదలకు కారణమైన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌గా మారింది. ఆకాశానికి చిల్లు పడ్డట్లు దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది అస్నా తుఫాన్‌. 1976లో అరేబియా సముద్రంలో మొదటిసారి ఈ తుఫాన్‌ పాకిస్తాన్‌లో ఏర్పడింది. అంతకంటే ముందు 1944, 1964 సంవత్సరాల్లో తీర ప్రాంతాల్లో ఈ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపింది.

ఇప్పటికే భారీ వర్షాలతో గజగజా వణుకుతోంది గుజరాత్‌. దాదాపు 20వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. 32మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. 1200 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వరదల్లో వేలమంది నిరాశ్రయులయ్యారు. గుజరాత్‌లోని వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా నదులు ఉప్పొంగి ప్రవహించటంతో చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వడోదరలో విశ్వామిత్ర నది పొంగి పొర్లుతోంది. విశ్వామిత్ర నది పరిసర గ్రామాల్లో ఇళ్లలోకి మొసళ్లు చొచ్చుకువచ్చాయి.

గుజరాత్‌ వరద 1998 నాటి జల విలయాన్ని కళ్లకు కడుతోంది. రాజధాని అహ్మదాబాద్‌ సహా వడోదర. జామ్‌నగర్‌, ద్వారక, కచ్‌, పోరుబందర్‌, రాజ్‌కోట్‌.. ఇలా గుజరాత్‌ వ్యాప్తంగా ఎటుచూసినా వరద కష్టాలే. వరద ఉధృతితో గుజరాత్‌లోని 96 రిజర్వాయర్లలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. మరో 19 రిజర్వాయర్ల డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఇప్పుడు అస్నా తుఫాన్ గుజరాత్‌ని గండమై వెంటాడుతోంది.

గుజరాత్‌లోని భుజ్ కు 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది అస్నా తుఫాన్‌. 24గంటల్లో అది భారత తీరానికి దూరంగా వెళ్లిపోతుందని ఐఎండీ సూచించింది. వాస్తవానికి ఆగస్టులో తుఫాన్‌లు రావడం చాలా అరుదు. కానీ, సముద్రాలు వేడెక్కడంతో ముందస్తుగానే తుఫాన్లు వచ్చిపడ్డాయని అంచనావేస్తోంది. దక్షిణాదిలో తెలుగురాష్ట్రాలతో పాటు కర్నాటక, కేరళల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళా రేపు ఛత్తీస్‌గఢ్, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో విదర్భ, సెప్టెంబర్ 2న తూర్పు మధ్యప్రదేశ్, సెప్టెంబర్ 4 వరకు గుజరాత్‌లో భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి.

ఒడిశాకు కూడా భారీ వర్షపాతంపై వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల్లో సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య భారతంలో సెప్టెంబరు 2, 3 తేదీల్లో జమ్ముకశ్మీర్, లడఖ్, గిల్గిత్, ముజఫరాబాద్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్‌లో వర్షాలు పడతాయంటోంది వాతావరణశాఖ. ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, కేరళలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలతో ప్రజలు చిన్నచిన్న పడవలపై గడప దాటాల్సి వస్తోంది.

1944, 1964, 1976 సంవత్సరాల్లోనే ఇప్పటిదాకా ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది. అయితే ఆ మూడు సందర్భాల్లో అవి బలహీన తుఫాన్లుగానే నమోదయ్యాయని తెలిపింది. కానీ ఆస్నా ప్రభావంపై హెచ్చరికలతో పొరుగుదేశం పాకిస్తాన్‌ కూడా అప్రమత్తమైంది. గుజరాత్‌కి 250 కిలోమీటర్లు, కరాచీకి 160 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయింది. అస్నా తుఫాన్‌ గుజరాత్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీనుంచి అతి భారీ వర్ష సూచనతో ఇప్పటికే పీకల్లోతు వరదలో ఉన్న గుజరాత్‌ని గోరుచుట్టుపై రోకటిపోటులా తుఫాన్‌ మరింత భయపెడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

చేపలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన మహిళ..అక్కడ కనిపించిన ఫిష్
చేపలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన మహిళ..అక్కడ కనిపించిన ఫిష్
ఆ జాతరలో ఫ్లెక్సీలే హైసెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు
ఆ జాతరలో ఫ్లెక్సీలే హైసెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే వావ్ అంటారు
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కారణమిదే
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కారణమిదే
బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు.. ఆకలిచావులతో మృతి
బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు.. ఆకలిచావులతో మృతి
అంతుచిక్కని మిస్టరీ వ్యాధి.. 14 మంది చిన్నారులు మృత్యువాత..
అంతుచిక్కని మిస్టరీ వ్యాధి.. 14 మంది చిన్నారులు మృత్యువాత..
భారత్‌కు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపలు
భారత్‌కు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపలు
ఐటీబీపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
ఐటీబీపీ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
వాచ్‌మెన్‌గా 165 జీతం.. ఇప్పుడు రూ.కోట్లు తీసుకునే స్టార్ యాక్టర్
వాచ్‌మెన్‌గా 165 జీతం.. ఇప్పుడు రూ.కోట్లు తీసుకునే స్టార్ యాక్టర్
ముంచుకొస్తున్న సముద్ర ముప్పు.. ముందస్తు హెచ్చరికలు జారీ
ముంచుకొస్తున్న సముద్ర ముప్పు.. ముందస్తు హెచ్చరికలు జారీ
ఏం తెలివిరా బాబు.. భలే స్మార్ట్ గా లూటీ చేశారు..! ఖాకీలే షాక్..
ఏం తెలివిరా బాబు.. భలే స్మార్ట్ గా లూటీ చేశారు..! ఖాకీలే షాక్..