Covid Scare: కరోనా భయంతో 3 ఏళ్లుగా ఇంట్లోనే.. భర్తను కూడా రానివ్వకుండా 10 ఏళ్ల కొడుకుతో..

కరోనా యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా మంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. నేటికీ ప్రపంచం మహమ్మారి నుంచి బయటపడలేకపోతోంది. ఇన్‌ఫెక్షన్‌ భయంతో ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఇంట్లోనే ఉంటున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Covid Scare: కరోనా భయంతో 3 ఏళ్లుగా ఇంట్లోనే.. భర్తను కూడా రానివ్వకుండా 10 ఏళ్ల కొడుకుతో..
Gurugram Woman Locked Herse
Follow us

|

Updated on: Feb 23, 2023 | 12:10 PM

కొవిడ్ భయం వీడటం లేదు. మూడేళ్లు గడుస్తున్నా బయటకు వచ్చేందుకు బయపడుతున్నారు కొందరు జనం. బయటకి రాకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా గురుగ్రామ్‌లో వెలుగులోకి వచ్చింది. తన 10 ఏళ్ల కుమారుడిని సైతం ఇంట్లో నుంచి బయటకు రానియ్యకుండా ఇంట్లోనే ఉంటోంది ఓ మహిళ. భర్త ఎంత చెప్పినా వినలేదు.. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పడు తల్లీకుమారుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. హరియాణా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గురుగ్రామ్​లోని మారుతీ విహార్​కు చెందిన మున్​మున్​ అనే మహిళ తన భర్త, 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. అయితే కొవిడ్ వచ్చినప్పటి నుంచి ఆమె తన కుమారుడితో కలిసి ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. చివరికి తన కుమారుడిని కూడా బయటకి వెళ్లేందుకు నో చెప్పడంతోపాటు తన భర్తను ఇంట్లోకి రానివ్వకుండా లోపలి నుంచి తాళం వేసుకుంది.

గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో బంధువులు, స్నేహితుల ఇంట్లో కొన్నాళ్లు పాటు తలదాచుకున్న భర్త చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆరోగ్య సిబ్బందిని వెంటబట్టెకుని ఇంటి తలుపులు పగలగొట్టి తల్లీకుమారుడిని ఆస్పత్రికి తరలించారు.

మున్​మున్​ భర్త.. ఆమెకు, కుమారుడికి భోజనం, నీరు అందించి.. అనంతరం ప్రాథమిక చికిత్స అందించారు. కొవిడ్ ముగిసిందని తన భార్యను ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె వినలేదని ఆవెదన వ్యక్తం చేశాడు.

అసలేం జరిగిందంటే..

2020లో మొదటి లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత.. ఆమె మరింత అప్రమత్తమైంది. రోజూ భోజనానికి భర్త సాయం తీసుకునేది. విచిత్రమేమిటంటే, లాక్‌డౌన్ ఎత్తివేసినప్పుడు.. ఇంట్లో నుంచి  బయటకు వచ్చిన భర్తను ఇంట్లోకి రానివ్వలేదు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న మహిళ భర్త సుజన్ మాజి ఇంటి మెయిన్ డోర్ వద్దకు కిరాణా సామాన్లు తెచ్చేవాడు. ఇంటి అద్దె, కరెంటు, నీటి బిల్లులు సహా అన్ని అవసరాలను బయటి నుంచి తీర్చుకునేవారు. వీడియో కాల్ ద్వారా మాత్రమే మాట్లాడుకునేవారు. మూడేళ్లుగా ఆమె, కొడుకు ఇంటికే పరిమితమయ్యారు. భర్త ఎన్నిసార్లు విన్నవించినా ఆమె ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రాలేదు.

మూడేళ్లుగా తల్లీకొడుకులు బయటకు రాకపోవడంతో ఇంట్లో అనవసరమైన వస్తువులు, జుట్టు, కిరాణా సామాన్లు కుప్పలు తెప్పలుగా పోసి చెత్తకుండీగా మార్చేసింది. తన కొడుకు జుట్టును ఇంట్లో కత్తిరించింది. గ్యాస్ పొయ్యికి బదులుగా వారు ఇండక్షన్ ద్వారా వంటలు చేసుకునేవారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం