Viral: తనిఖీల్లో భాగంగా పాల ట్యాంకర్‌ను ఆపిన పోలీసులు.. లోపల ఉన్నది చూసి మైండ్ బ్లాంక్
కల్తీపాలకు.. ఫేమస్ కంపెనీల లేబుల్స్ పెట్టేస్తారు. ఛాయ్ దుకాణాలకు, రెస్టారెంట్లకు, హెటల్స్‌కు, కిరణా షాప్స్‌కి సైలెంట్‌గా సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకు రావటంతో ఆయా దుకాణదారులు కూడా వీటివైపే మొగ్గు చూపుతున్నారు.
Gujarat: సమాజంలో కల్తీ మనుషులు ఎక్కువైపోయారు. కల్తీ పనులు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మనం తినే ఫుడ్, తాగే నీళ్లు.. ఇలా అన్నింటిని కలుషితం చేసేస్తున్నారు. ప్రజలు వంటిట్లో వినియోగించే ప్రతి పదార్థం కల్తీ అవుతుంది. కాసులు కాక్కుర్తితో.. రోజురోజుకు క్రైమ్ పరిధి విస్తరించుకుంటూ వెళ్తున్నారు కేటుగాళ్లు. తాజాగా 4,000 లీటర్ల కల్తీ పాలను గుజరాత్ రాజ్‌కోట్(Rajkot) పోలీసులు సీజ్ చేశారు. సాధారణ తనిఖీలు చేస్తుండగా ఓ పాల ట్యాంకర్ అటుగా వచ్చింది. పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేయగా.. లోపల రసాయనాలతో తయారు చేసిన మిల్క్ ఉన్నట్లు తేలింది. వెంటనే ఆ పాలను సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సల్ఫేట్‌లు, ఫాస్ఫేట్లు, కార్బోనేట్ ఆయిల్‌ల వంటి ప్రమాదకర రసాయనాలతో ఈ కల్తీ పాలను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత నాలుగు నెలలుగా కల్తీ పాలు సరఫరా అవుతున్నాయని రాజ్‌కోట్ జోన్-1 డీసీపీ ప్రవీణ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ పాలను తయారు చేస్తున్న ప్రాంతాన్ని గుర్తించి.. సీజ్ చేసినట్లు కూడా ఆయన చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు. కల్తీ పాల వల్ల ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాలు చిన్న పిల్లలకు ఎక్కువగా పట్టిస్తారని.. వారి భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ట్యాంకుల కొద్దీ తరలివస్తున్న కల్తీ పాలు మీ వంట గదికి కూడా చేరే అవకాశం ఉంది. సో.. తెల్లనివన్నీ పాలు కాదు.. తస్మాత్ జాగ్రత్త.
Gujarat | Four thousand liters of adulterated milk seized from a truck in Rajkot (16.08)
A truck was stopped during checking of vehicles & adulterated milk that was made from chemicals like sulfates, phosphates & carbonate oils was seized:Praveen Kumar Meena, DCP Zone-1, Rajkot pic.twitter.com/3vpJciqgNq
— ANI (@ANI) August 16, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..