AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్ ATS బిగ్ ఆపరేషన్.. 8 మంది జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్..!

గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) మేజర్ ఆపరేషన్‌లో పాకిస్తాన్ మద్దతు గల నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ (JeM)కు చెందిన 8 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఈ అరెస్టులు గుజరాత్ మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగాయి. గుజరాత్ ATS అధికారులు విశ్వసనీయ ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.

గుజరాత్ ATS బిగ్ ఆపరేషన్.. 8 మంది జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్..!
Jaish Operatives Arrested
Balaraju Goud
|

Updated on: Jul 04, 2026 | 11:05 AM

Share

గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) మేజర్ ఆపరేషన్‌లో పాకిస్తాన్ మద్దతు గల నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ (JeM)కు చెందిన 8 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఈ అరెస్టులు గుజరాత్ మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగాయి. గుజరాత్ ATS అధికారులు విశ్వసనీయ ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. అరెస్టయిన వారు గత ఆరు నెలలుగా గుజరాత్‌లో జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, యువతను తీవ్రవాద భావజాలంతో ప్రేరేపించడానికి, సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.. నిఘా వర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన గుజరాత్ ATS బనాస్కంఠ జిల్లాలో ముగ్గురిని, పటాన్ జిల్లాలో ముగ్గురిని, నవసారి జిల్లాలో ఒకరిని , మధ్యప్రదేశ్ దేవాస్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు

20 ఏళ్ల వయసులో ఉగ్రవాదం వైపు..

గుజరాత్ ATS అరెస్ట్ చేసిన వారిలో మెజార్టీ వారంతా 20 ఏళ్ల వయసు వారే..! చదువుకోవాల్సిన వయసులో ఉగ్రవాద సంస్థల్లో చేరడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా ఇతర యువతను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ గుజరాత్‌లో ఉగ్ర సంస్థల ఏర్పాటు వాటి విస్తరణకు మూలంగా నిలుస్తున్నారు. అరెస్ట్ అయినవారిని అహ్మద్ అబ్దుల్లా అలియాస్ అబూ ఉబైదా (19) , ఇబ్రహీం మహమ్మద్ హుసేన్ అలియాస్ అబూ హమ్జా (30), ముదస్సిర్ అబ్దుల్లా అలియాస్ అబూ ఆయా (22), జకరియా దురాని అలియాస్ ఇబ్న్ అమ్మార్ (21), ముఫ్తి ఫౌజన్ అలియాస్ ముఫ్తి సాహెబ్ (40), మహమ్మద్ అమీన్ షేరా (21), మహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ అలియాస్ అబూ ఉనీసా (22), బిలాల్ దురాని మహమ్మద్ అలియాస్ అబూ దుజానా (18) గా గుర్తించారు.

పోలీస్ కస్టడీకి నిందితులు..!

పోలీసులు నిందితులపై UAPA సెక్షన్లు 13, 17, 18, 38, 39, BNS సెక్షన్లు 148, 61 కింద కేసు నమోదు చేశారు. నిందితులు పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మహమ్మద్ హ్యాండ్లర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు, డిజిటల్ ఆధారాలు, జిహాదీ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ATS అధికారులు తెలిపారు. కోర్టు నిందితులందరినీ 14 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం దర్యాప్తు అధికారులు ఉగ్రవాదుల నెట్‌వర్క్, ఫండింగ్ మార్గాలు, పాకిస్తాన్ కనెక్షన్లు, ఇతర సాధ్యమైన ఉగ్రవాద ప్రణాళికలపై విస్తృతంగా విచారణ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా గుజరాత్‌లో పెద్ద ఎత్తున ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు అయ్యే ముందే కుట్రను ఛేదించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రథయాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర భద్రతను బలోపేతం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు జరగవచ్చని ATS వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us