AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court Judgement: విచారణ జరుగుతుండంగా కూల్‌డ్రింక్ తాగాడు.. అంతే.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు జడ్జి..

కరోనా థర్డ్ వేవ్(covid third wave) సమయంలో ఎన్నో వింతలు, విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కోవిడ్ లాక్ డౌన్(lockdown) సమయంలో వ్యవస్థలన్నీ ఫర్క్ ఫ్రం హోంకు(work from home) మారిపోయాయి. ఆ సమయంలో..

Court Judgement: విచారణ జరుగుతుండంగా కూల్‌డ్రింక్ తాగాడు.. అంతే.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు జడ్జి..
Cold Drinks
Sanjay Kasula
|

Updated on: Feb 18, 2022 | 1:32 PM

Share

కరోనా థర్డ్ వేవ్(covid third wave) సమయంలో ఎన్నో వింతలు, విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కోవిడ్ లాక్ డౌన్(lockdown) సమయంలో వ్యవస్థలన్నీ ఫర్క్ ఫ్రం హోంకు(work from home) మారిపోయాయి. ఆ సమయంలో న్యాయ వ్యవస్థ (judicial department) కూడా వర్చువల్ (virtual court )పద్ధతిలో నిర్వహించారు. అప్పుడే గుజరాత్ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీస్ అధికారి చేసిన చిన్న పొరపాటు అతనిపై వేటు పడేలా చేసింది. ఓ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో అతను కూల్ డ్రింక్ తాగడమే ఆ పోలీసు అధికారి చేసిన నేరం. వర్చువల్ కోర్టులో ఓ కేసుపై సీరియస్‌‌గా విచారణ జరుపుతున్నారు హైకోర్టు న్యాయమూర్తి.. అదే సమయంలో జడ్జి దృష్టి కూల్ డ్రింక్ తాగుతున్న అధికారిపై పడింది. వెంటనే సదరు అధికారిని మందలించారు జడ్జ్.

వివరాల్లోకి వెళ్లితే.. వర్చువల్ హియరింగ్‌ జరుగుతున్న సమయంలో ఇన్‌స్పెక్టర్ ఏఎం రాథోడ్ కూల్ డ్రింక్ తాగుతుండగా న్యాయమూర్తి చూశారు. ఇది గుజరాత్ హైకోర్టు చీఫ్ అరవింద్ కుమార్ దృష్టికి వచ్చింది. విచారణ మధ్యలో వదిలేసి.. వెంటనే అతడిని మందలించారు. “మిస్టర్ రాథోర్ శీతల పానీయాలు తాగుతున్నారా..? అంటూ పోలీసు ఇన్‌స్పెక్టర్‌‌ను జడ్జి ప్రశ్నించారు. దీంతో ఆ అధికారి వెంటనే న్యాయమూర్తులకు క్షమాపణలు చెప్పినా అతడిని విడిచిపెట్టలేదు జడ్జి.

ముందుగా ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణ వర్చువల్‌గా కాకుండా కోర్టు లోపల ఉంటే.. మీరు కోర్టు లోపల శీతల పానీయాల డబ్బా తెచ్చుకుని తాగుతారా అని ప్రశ్నించారు. ఏ పోలీసు అధికారి అయినా ఇలా ప్రవర్తిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే సమయంలో గతంలో కోర్టులో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెప్పారు ప్రధాన న్యాయమూర్తి.

గతంలో ఓ సమోసాల కేసు..

ఒకసారి విచారణ సందర్భంగా ఒక న్యాయవాది సమోసా తినడాన్ని న్యాయమూర్తి చూశారు. వెంటనే అతడిని మందలించారు. అంతే కాదు.. ఇది సమోసా తినే సమయమేనా .. అంటూ ప్రశ్నించారు. అంతే కాదు ..  సమోసా ఎవరు  తిన్నా మనకేం ఇబ్బంది లేదు.. కానీ హియరింగ్‌ సమయంలో తినడం తప్పు.., ఎందుకంటే ఇతరులు కూడా దీన్ని ఇష్టపడవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఒక్కరే  సమోసాలు తినకూడదు.. అక్కడ ఉన్న అందిరికి సమోసాలు అందించాలని ఆదేశించారు ఆ రోజు న్యాయమూర్తి.

ఈ కేసులో..

ఈ కేసులో శిక్షగా బార్ అసోసియేషన్‌కు 100 క్యాన్ల శీతల పానీయాలు ఇవ్వాలని న్యాయమూర్తి పోలీసు అధికారిని ఆదేశించారు. క్రమశిక్షణా చర్యలు కోరుకోకుంటే సాయంత్రంలోగా అందరూ కోర్టుకు శీతల పానీయాల డబ్బాలతో కోర్టుకు రావాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: Petrol Diesel Price: రష్యా-ఉక్రెయిన్ రచ్చ కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు.. మన దేశంలో మాత్రం పెట్రోల్-డీజిల్ ధరలు ఇలా..

CM Jagan: గుంటూరు జిల్లాలో ఇస్కాన్ అక్షయపాత్ర.. ప్రారంభించనున్న సీఎం జగన్..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే