Breaking! NEET MDS 2022 పరీక్ష వాయిదా..! అప్పటివరకు నో ఎగ్జాం..

ఇంటర్న్‌షిప్‌ గడువు తేదీని మార్చి 31కి బదులుగా జూలై 31గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుపుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Union Health Ministry) గురువారం (ఫిబ్రవరి 17) నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

Breaking! NEET MDS 2022 పరీక్ష వాయిదా..! అప్పటివరకు నో ఎగ్జాం..
Neet Mds 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 18, 2022 | 1:32 PM

NEET MDS exam 2022 date postponed: నీట్ ఎమ్‌డీఎస్‌ పరీక్ష 2022 నాలుగు నుండి ఆరు వారాలపాటు వాయిదా పడేఅవకాశం కనిపిస్తోంది. ఎమ్‌డీఎస్‌ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించాలంటే ఎంబీబీఎస్‌ విద్యార్ధులు ఇంటర్న్‌షిప్‌ (compulsory rotating internship)ను ఖచ్చితంగా పూర్తిచేయవల్సి ఉంటుంది. ఐతే గత ఏడాది కోవిడ్ విధుల్లో ఉండటం వల్ల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయలేకపోయిన విద్యార్ధుల కోసం ఇంటర్న్‌షిప్‌ గడువు తేదీని మార్చి 31కి బదులుగా జూలై 31గా నిర్ణయించే అవకాశం ఉందని తెలుపుతూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Union Health Ministry) గురువారం (ఫిబ్రవరి 17) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్- ఎమ్‌డీఎస్‌ 2022, నీట్‌ పీజీ 2022 పరీక్షల మధ్య సమానతను తీసుకురావడానికి ఈ ఏడాది జరగనున్న నీట్‌ ఎమ్‌డీఎస్‌ పరీక్ష తేదీలో కాంపిటెంట్ అథారిటీ మార్పులు చేసినట్లు సమాచారం. దీంతో ఈ పరీక్ష 4-6 వారాల పాటు వాయిదా వేసే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎండీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రొటేటింగ్‌ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసే తేదీని మార్చి 31కి బదులుగా జూలై 31గా నిర్ణయించవచ్చని తెల్పింది.

కాగా నీట్‌ ఎండీఎస్‌ 2022 పరీక్ష తేదీని 4-6 వారాల పాటు వాయిదావేయాలని, అలాగే ఇంటర్న్‌షిప్‌ తేదీని పొడిగించాలని యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఐతే పరీక్ష ఎప్పుడనేది ఇంకా నిర్ణయించబడలేదు. నీట్‌ యూజీ 2022, నీట్‌ ఎమ్‌డీఎస్‌ 2022 పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు అప్‌డేట్ల కోసం తప్పనిసరిగా రెండింటి అధికారిక వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలని సూచించింది.

Also Read:

NEET PG 2021: నీట్‌ పీజీ 2021 కౌన్సెలింగ్‌ రౌండ్‌ 2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..