NEET PG 2021: నీట్‌ పీజీ 2021 కౌన్సెలింగ్‌ రౌండ్‌ 2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

ఎండీ/ఎంఎస్‌/డిప్లొమా/డీఎన్బీ కోర్సుల్లో ప్రవేశాలకుగానూ నీట్‌ పీజీ రౌండ్‌ 2 కౌన్సెలింగ్ 2021 (NEET PG counselling 2021)కు సంబంధించిన తాత్కాలిక ఫలితాల (provisional results)ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee) గురువారం (ఫిబ్రవరి 17) విడుదల చేసింది..

NEET PG 2021: నీట్‌ పీజీ 2021 కౌన్సెలింగ్‌ రౌండ్‌ 2 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..
Neet Pg 2021
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 18, 2022 | 12:57 PM

Provisional result for round-2 of NEET PG 2021 counselling: ఎట్టకేలకు నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఎండీ/ఎంఎస్‌/డిప్లొమా/డీఎన్బీ కోర్సుల్లో ప్రవేశాలకుగానూ నీట్‌ పీజీ రౌండ్‌ 2 కౌన్సెలింగ్ 2021 (NEET PG counselling 2021)కు సంబంధించిన తాత్కాలిక ఫలితాల (provisional results)ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee) గురువారం (ఫిబ్రవరి 17) విడుదల చేసింది. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ mcc.nic.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఐతే ఇవి తాత్కాలిక ఫలితాలు మాత్రమేనని, తుది ఫలితాల ప్రకటనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెల్పింది. ఫైనల్ రిజల్ట్స్‌ ప్రకటన తర్వాత మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, కేటాయించిన కాలేజ్‌ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్‌ చెయ్యాలని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ తాజా ప్రకటనలో తెల్పింది. అదేవిధంగా ఎవరెవరి కోటా లేదా కేటగిరీలో అయితే మార్పులు చోటుచేసుకున్నాయో.. ఆయా విద్యార్ధులందరూ ఆన్‌లైన్‌ ద్వారా అందించే రిలీవింగ్‌ లెటర్‌ను తీసుకుని, కేటాయించిన ఇన్‌స్టిట్యూషన్‌లో అడ్మిషన్‌ పొందాలని తెల్పింది. ఇటువంటి విద్యార్థులు (కేటగిరీ లేదా కోటా మారినందున) ఆన్‌లైన్‌లో కొత్త అడ్మిషన్ లెటర్‌లను పొందవలసి ఉంటుందని, లేదంటే కేటాయించిన సీటు క్యాన్సిల్‌ అవుతుందని ఎమ్‌సీసీ విద్యార్ధులకు సూచించింది.

నీట్‌ పీజీ కౌన్సెలింగ్ 2021 రౌండ్‌ 2 ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ అధికారిక వెబ్‌సైట్‌ mcc.nic.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే ‘PG Medical Counselling’ అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • Current events’ sectionలోని, ‘provisional allotment result round 2 PG 2021’ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • న్యూ విండోలో పీడీఎఫ్‌ ఓపెన్‌ అవుతుంది.
  • సేవ్ చేసుకుని, డౌన్‌లోడ్ చెయ్యాలి.

Also Read:

NHM Chittoor Recruitment 2022: నేషనల్ హెల్త్‌ మిషన్‌.. చిత్తూరు జిల్లాలో 110 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే..