Gujarat Earthquake: గుజరాత్ లో భూకంపం.. మూడురోజుల్లో రెండోసారి కంపించిన భూమి..
Gujarat Earthquake: గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లో సోమవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రియాక్టర్ స్కేల్‌లో భూకంప తీవ్రత 3.8 గా నమోదు అయింది.
Gujarat Earthquake: గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లో సోమవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రియాక్టర్ స్కేల్‌లో భూకంప తీవ్రత 3.8 గా నమోదు అయింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, రాజ్‌కోట్ దక్షిణ భాగంలో తెల్లవారుజామున 3.37 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు. గుజరాత్ లో గత మూడురోజుల్లో ఇది రెండో భూకంపం. మొన్న శనివారం మణిపూర్‌లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. దీని భూకంపం యొక్క కేంద్రం ఉక్రుల్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ రియాక్టర్ స్కేల్‌లో భూకంప తీవ్రత 4.5 గా నమోదు అయింది.
భూకంపం పై ఏఎన్ఐ ట్వీట్..
An earthquake of magnitude 3.8 on the Richter scale occurred near 182km South of Rajkot at 3:37 am today: National Center for Seismology#Gujarat pic.twitter.com/vqJmcyPhya
— ANI (@ANI) May 16, 2021
కాగా, ఏడాది క్రితం కచ్‌లో మూడు రోజుల నిరంతర భూకంపం సంభవించింది. రాజ్‌కోట్ నుండి 83 కిలోమీటర్ల దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించే కంటె ముందుగా ఇక్కడ ఇక్కడ 3.5 తీవ్రతతో వరుస ప్రకంపనలు సంభవించాయి. ఆ తరువాత గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో రాత్రి 8.30 గంటల వరకు ప్రకంపనలు సంభవించాయి. ఈ కాలంలో 14 సార్లు భూమి కంపించిందని వాతావరణ శాఖ తెలిపింది.
19 సంవత్సరాల క్రితం.. 26 జనవరి 2001 న గుజరాత్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భుజ్ మరియు కచ్లలో, ఈ సమయంలో భారీ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఈ భూకంపం కారణంగా 10 వేల మంది మరణించారు. 2 వేల మృతదేహాలను జనవరి 26న బయటకు తీశారు. వీరిలో భుజ్‌లోని ఒక పాఠశాలలో చనిపోయిన 400 మంది పిల్లలు ఉన్నారు. ఆస్పత్రులు కూడా దెబ్బతిన్నాయి.
వేసవి కాలంలో గుజరాత్ లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. 2001లో సంభవించిన భూకంపం తరువాత పెద్ద భూకంపం సంభవించిన రికార్డు లేదు. అప్పటి భూకంపం ప్రభావం ఇప్పటికీ గుజరాత్ ప్రజల్లో కనిపిస్తుంది.
Also Read: విషసర్పాలు ఏమీ చేయలేకపోయాయి, కరోనా మాత్రం కాటేసింది