Dr Gaurav Gandhi: 16 వేల ప్రాణాలను నిలబట్టిన కార్డియాలజిస్ట్ గుండె.. హార్ట్ అటాక్‌తో ఆగిపోయింది…
ఆయన్ను బతికించం కోసం డాక్టర్లు 2 గంటలపాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ గౌరవ్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో అందరూ షాక్ తిన్నారు.
సొసైటీలో గుండెపోటు మరణాలు ప్రజంట్ కవలవర పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఫేమస్ కార్డియాలజిస్ట్ 41 ఏళ్ల వయస్సులో హార్ట్ ఎటాక్‌తో మృతిచెందడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. హృద్రోగ సమస్యలు ఉన్న 16 వేల మందికిపైగా బాధితులకు కార్డియాలజిస్ట్ డాక్టర్ గౌరవ్ గాంధీ ఆపరేషన్స్ చేశారు. ఆయన సోమవారం కూడా రాత్రి వరకు రోగులుకు చికిత్స అందించారు. నైట్ ప్యాలెస్ రోడ్‌లోని తన ఇంటికి వెళ్లి.. భోజనం అనంతరం నిద్రకు ఉపక్రమించారు. తెల్లారి 6 గంటలు ప్రాంతంలో కుటుంబ సభ్యులు నిద్రలేపేందకు ఆయన రూమ్‌కు వెళ్లారు. ఆయన అపస్మాకర స్థితిలో కనిపించడంతో వెంటనే.. ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ గౌవర్‌ను బతికించేందుకు డాక్టర్లు రెండు గంటలపాటు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా నో రిజల్ట్. టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్, ‘గుండెపోట్లను అరికడదాం’ అని ఫేస్‌బుక్‌లో చేస్తున్న ప్రచారంలో భాగంగా ఉన్న గౌరవ్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడంతో అందర్నీ షాక్‌కు గురిచేసింది.
1982లో జన్మించిన డాక్టర్ గౌరవ్.. జామ్‌నగర్‌లో MBBS కంప్లీట్ చేశారు. తర్వాత అహ్మదాబాద్‌లో కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేశారు. ఆ తర్వాత తిరుగులేని డాక్టర్‌గా పేరుతెచ్చుకున్నారు. దాదాపు 16 వేల యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ హార్ట్ సర్జరీలు చేసిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఆయన భార్య దేవాన్షి గాంధీ డెంటిస్ట్. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా ఈ మధ్య గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. దీనికి గత కారణాలపై ప్రజంట్ అధ్యయనాలు కొనసాగుతున్నాయి. మంచి లైఫ్ స్టైల్ పాటించడం.. నిత్యం వ్యాయామం చేయడం.. ఉప్పు తగ్గించడం, ఆయిల్ ఫుడ్‌కి దూరంగా ఉండటం.. ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా గుండె జబ్బులు నుంచి దూరంగా ఉండవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.