Monsoon: హమ్మయ్య.. ! చల్లటి వార్త వచ్చేసింది.. రుతుపవనాల రాక ఎప్పుడంటే..?

వేసవి ముగిసిన వెంటనే పలకరించాల్సిన తొలకరి ఇంకా దోబూచులాడుతోంది. అకాల వర్షాలతో ఇన్నాళ్లూ తడిసిముద్దయినా స్వచ్ఛమైన రుతుపవన వాన కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు జనం. కానీ.. మన్సూన్‌కి ఎక్కడో బ్రేకులు పడుతున్నాయి. ఎక్కడ...? నైరుతి రుతుపనాన్ని అడ్డుకుంటున్న ఆ శక్తులేమిటి? రుతుపవనాల ఆగమనం ఎప్పుడు..?

Monsoon: హమ్మయ్య.. ! చల్లటి వార్త వచ్చేసింది.. రుతుపవనాల రాక ఎప్పుడంటే..?
Southwest Monsoon
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 07, 2023 | 4:37 PM

ఏటా మే నెల ఆఖర్లో గానీ, జూన్ ఫస్ట్‌వీక్‌లో గానీ నైరుతి రుతుపవనం కేరళను తాకాలి. గత ఏడాది మే 29, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది మాత్రం ఆ సుముహూర్తం వాయిదా పడుతూనే ఉంది. మొదట్లో జూన్ నాలుగోతేదీ అని, ఆ తర్వాత ఏడున… అంటే బుధవారం మన్సూన్ వచ్చుడు పక్కా అని అనౌన్స్‌మెంట్ ఇచ్చింది IMD. కానీ.. ఏదో అంతుబట్టని శక్తి సైంధవుడిలా అడ్డుపడుతోంది.

అరేబియా మహాసముద్రంలో తిష్ట వేసిన బిపర్ణాయ్ తుఫాన్ కదలికలే రుతుపవనాల గమనాన్ని శాసిస్తున్నాయట. మరో 9రోజుల పాటు అరేబియా సముద్రంలో ఉత్తరం దిశగా ఈ తుఫాను కొనసాగే చాన్సుంది. తీవ్ర తుఫాన్‌గా మారుంతుందంటున్న హెచ్చరికలూ ఉన్నాయి. దీని ఫలితంగానే పదిరోజులుగా అండమాన్, లక్షద్వీప్‌లోనే నిలిచిపోయాయి రుతుపవనాలు. తుపాను కారణంగా రుతుపవనాలు మరింత ఆలస్యం కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనా తప్పింది. రానున్న 48 గంటల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) బుధవారం తెలిపింది. చల్లని గాలులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్, కేరళ తీరాల ప్రాంతాలలో మేఘాల పెరుగుదల కనిపిస్తోందని  వెల్లడించింది.

కేరళ నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది నైరుతి రుతుపవనం. దీని రాకతోనే దేశమంతా చల్లబడేది. విత్తు పెట్టేందుకు..  రుతుపవనాల రాక కోసం  ఎదురు చూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా