ఫస్ట్‌నైట్ రోజున వరుడి వింత కోరిక.. దెబ్బకు బిత్తరపోయిన నవవధువు.. ఆపై జరిగిందిదే
యూపీలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన పెళ్లి జరిగిన రోజు రాత్రి నూతన వధువుకు ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చి.. గర్భాధారన పరీక్ష చేయమాన్నాడు. అతని మాటలు విన్న వధువు ఆగ్రహంతో వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో వధువు బంధువులు అక్కడికి చేరుకోవడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. చివరకు వరుడు తాను తప్పుచేశానని ఒప్పుకోవడంతో సమస్య సద్ధుమణిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి తన పెళ్లి జరిగిన రోజు రాత్రి నూతన వధువుకు ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చి.. గర్భాధారన పరీక్ష చేయమాన్నాడు. అతని మాటలు విన్న వధువు ఆగ్రహంతో వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. కొన్ని నివేదికల ప్రకారం…యూపీకి చెందిన ఓ వ్యక్తికి యువతితో జులై 12న వివాహం జరిగింది. వివాహం తర్వాత వధూవరులు ఊరేగింపుగా తన కొత్త ఇంటికి చేరుకున్నారు. అయితే ఊరేగింపులో, వేడి వాతావరణం, అలసట కారణంగా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వధువుకు తలతిరుగుతున్నట్టు అనిపించింది. ఇదే విషయాన్ని ఆమె వరుడితో చెప్పింది.
అయితే వధువు చెప్పిన మాటలు విన్న వరకుడు భయపడి, కంగారుపడిపోయాడు. ఈ విషయాన్ని కొంతమంది స్నేహితులతో పంచుకున్నాడు. అయితే అతని ఫ్రెండ్స్ ఇవి గర్భధారణకు సంకేతం కావచ్చునని హాస్యాస్పదంగా అతనితో అన్నారు. దీంతో వరుడు మరింత గందరగోళానికి గురయ్యాడు. వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయల్దేరాడు. ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ మెడికల్ షాప్‌కు వెళ్లి ఒక ప్రెగ్నిన్సీ కిట్‌ను తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి దాన్ని వధువుకు ఇచ్చి.. ప్రెగ్నిన్సీ టెస్ట్ చేయమని చెప్పాడు.
వరుడు చెప్పిన మాటలు విన్న వధువు షాక్ గురైంది. ఆగ్రహంతో వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసిన జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వధువు బంధువులు హుటాహుటీనా వరుడు ఇంటికి చేరుకున్నారు. వరుడు బంధువులకు జరిగిన విషయం చెప్పి వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. అయితే చాలా సేపటి తర్వాత గొడవ తీవ్రతరం అయ్యే క్రమంలో వాళ్ల గొడవను గమనించిన స్థానికులు కలగచేసుకొని.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీ సుమారు రెండు గంటల పాటు జరిగింది. చివరికి, వరుడు తన తప్పును బహిరంగంగా అంగీకరించి వధువు, ఆమె కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడు.మరో సారి ఇలా ప్రవర్తించనని హామీ ఇచ్చాడు. దీంతో వివాదం సద్దుమణిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




