Youtube: హద్దులు దాటుతోన్న యూట్యూబ్ ఛానెల్స్‌.. కేంద్రం సంచలన నిర్ణయం.. నెక్స్ట్ స్టెప్ జైలే అంటూ వార్నింగ్..

దేశంలో యూట్యూబ్ ఛానెల్స్ హవా అంతకంతకూ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కొన్ని ఛానెల్స్ జాతి వ్యతిరేక ప్రచారంతో..

Youtube: హద్దులు దాటుతోన్న యూట్యూబ్ ఛానెల్స్‌.. కేంద్రం సంచలన నిర్ణయం.. నెక్స్ట్ స్టెప్ జైలే అంటూ వార్నింగ్..
Youtube Channels Block
Follow us

|

Updated on: Dec 20, 2022 | 2:08 PM

దేశంలో యూట్యూబ్ ఛానెల్స్ హవా అంతకంతకూ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కొన్ని ఛానెల్స్ జాతి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో కూడిన కంటెంట్‌ను సృష్టించి.. అనేక వ్యూస్ సంపాదిస్తున్నాయి. దీంతో ఇలాంటి ఛానెల్స్‌కు అడ్డుకట్టు వేసేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో(పీఐబీ) ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోన్న మరో మూడు యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసింది. ఆయా ఛానెల్స్ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు సృష్టించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాయని పీఐబీ గుర్తించింది. ఈ మూడు ఛానెల్స్‌కు సుమారు 33 లక్షల సబ్‌స్కైబర్లు ఉండగా.. వాటిల్లో స్ట్రీమింగ్ అవుతున్న వీడియోలు దాదాపు అన్నీ కూడా అబద్దపు కంటెంట్‌తో కూడినవి అని.. వాటిని సుమారు 30 కోట్లకుపైగా వీక్షించారని పీఐబీ తేల్చింది.

ఇదిలా ఉంటే.. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తోన్న ఛానెల్స్ లేదా సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివరాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి. పీఐబీ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెల్స్ లిస్టులో న్యూస్ హెడ్‌లైన్స్(9.67 లక్షల సబ్‌స్క్రైబర్స్), సర్కారీ అప్‌డేట్(22.6 లక్షల సబ్‌స్క్రైబర్స్), ఆజ్‌తక్ లైవ్((65.6 లక్షల సబ్‌స్క్రైబర్స్) ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ ‌సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లు(EVMలు), వ్యవసాయ రుణాల మాఫీ మొదలైన వాటిపై తప్పుడు, కాంట్రవర్సీయల్ కంటెంట్‌ను క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నాయి. ఆయా వీడియోలకు నకిలీ లోగోలు, సంచలనాత్మక థంబ్‌నెయిల్స్ పెట్టి వీక్షకులను తప్పుదారి పట్టిస్తున్నట్లు పీఐబీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఛానెల్‌లు తమ వీడియోలను ప్రకటనలుగా ప్రదర్శిస్తూ.. యూట్యూబ్‌లో తప్పుడు సమాచారాన్ని మానిటైజ్ చేస్తున్నట్లు కనిపెట్టింది. కాగా, గతేడాది కాలంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వందకు పైగా యూట్యూబ్ ఛానెల్స్‌లను బ్లాక్ చేసిన విషయం విదితమే.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?