రిపబ్లిక్ డే సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్
రిపబ్లిక్ డే సందర్భంగా ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ గూగుల్ తనదైన శైలిలో విషెస్ చెప్పింది. భారత 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దింది. అంతేకాదు.. అందులో ప్రఖ్యాత ప్రదేశాలను, ఇండియా గేట్, తాజ్‌మహల్‌ను కూడా ప్రతిబింబించేలా తయారు చేసింది. ఇంకా భారత దేశానికి చెందిన శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి.. దేశంలోని వస్త్ర పరిశ్రమను కూడా చిత్రంలో చేర్చుతూ.. […]
రిపబ్లిక్ డే సందర్భంగా ఇంటర్నెట్ సర్చ్ ఇంజన్ గూగుల్ తనదైన శైలిలో విషెస్ చెప్పింది. భారత 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దింది. అంతేకాదు.. అందులో ప్రఖ్యాత ప్రదేశాలను, ఇండియా గేట్, తాజ్‌మహల్‌ను కూడా ప్రతిబింబించేలా తయారు చేసింది. ఇంకా భారత దేశానికి చెందిన శాస్త్రీయ సంగీతం, కళలు, మన జాతీయ పక్షి.. దేశంలోని వస్త్ర పరిశ్రమను కూడా చిత్రంలో చేర్చుతూ.. ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేశారు. దీనిని సింగపూర్‌కు చెందిన సేథ్ అనే కళాకారుడు రూపుదిద్దాడు.