పబ్ జీ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పబ్ జీ మొబైల్ ఇండియా?

భారత్, చైనా సరిహద్దు గొడవల వల్ల ఇండియాలో పబ్ జీ గేమ్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇండియాలో పబ్ జీ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు.

పబ్ జీ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పబ్ జీ మొబైల్ ఇండియా?
Follow us

|

Updated on: Nov 22, 2020 | 2:04 PM

భారత్, చైనా సరిహద్దు గొడవల వల్ల ఇండియాలో పబ్ జీ గేమ్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇండియాలో పబ్ జీ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ఇదే గేమ్ ఇప్పుడు పబ్ జీ మొబైల్ ఇండియా పేరుతో లాంచ్‌కానుంది. ఇండియన్ కస్టమర్లకు ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం సెప్టెంబర్‌లో పబ్ జీ గేమ్‌పై నిషేధం విధించింది. అప్పటికీ 17 కోట్ల ఇండియన్ స్మార్ట్‌ఫోన్లలో ఇది డౌన్‌లోడ్ అయింది. అంటే పబ్ జీకి భారత్‌లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రపంచంలో 25 శాతం పబ్‌జీ గేమర్స్ ఇండియా నుంచే ఉన్నారంటే మనవాళ్లు ఎంతగా ఈ గేమ్ ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో మళ్లీ తన రికవరీ రేటు పెంచుకోవడానికి పబ్ జీ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. అందుకోసం పబ్ జీ సొంత సంస్థ క్రాఫ్టన్, ఇండియన్ యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. సెక్యూరిటీ ఆడిట్లతో పాటు స్టోరేజీ తనిఖీలు నిర్వహించడానికి రెడీగా ఉంది. అతి త్వరలో ఓ కొత్త అవతారంలో మన ముందుకు రాబోతుంది. అయితే పబ్ జీ మొబైల్ ఇండియా లాంచ్‌కు దేశంలో అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మెదల్లలో నానుతోంది. ఈ గేమ్‌కు బానిసైన కొంతమంది యువత ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇండియన్ గవర్న్‌మెంట్ అటు పబ్ జీ కార్పొరేషన్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.