గోవాలో వికసించిన కమలం… స్థానిక పోరులో బీజేపీ జోరు… మెజార్టీ స్థానాలు కైవసం…

గోవా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జోరు చూపింది. లోకల్ ఫైట్‌లో విన్నర్‌గా నిలిచింది. గోవాలోని 49 జెడ్పీ స్థానాలకు గాను 32 స్థానాల్లో గెలిచి తన పట్టు నిలుపుకుంది.

  • Tv9 Telugu
  • Publish Date - 2:44 pm, Tue, 15 December 20
గోవాలో వికసించిన కమలం... స్థానిక పోరులో బీజేపీ జోరు... మెజార్టీ స్థానాలు కైవసం...

గోవా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జోరు చూపింది. లోకల్ ఫైట్‌లో విన్నర్‌గా నిలిచింది. గోవాలోని 49 జెడ్పీ స్థానాలకు గాను 32 స్థానాల్లో గెలిచి తన పట్టు నిలుపుకుంది. కాంగ్రెస్ కేవలం 4 స్థానాలకు, ఎంజీపీ 3 స్థానాలు, ఆప్ 1 స్థానం, ఎన్‌సీపీ 1 స్థానం, ఇతరులు 7 స్థానాల్లో గెలుపొందారు. కాగా బీజేపీ గెలుపుపై అధికార బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీపై నమ్మకాన్ని ఉంచారని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా 2022లో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.