AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gang Rape: ముంబైలో గ్యాంగ్ రేప్.. 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేయాలని స్నేహితులను ప్రోత్సహించిన యువతి..

ముంబైలో దారుణం జరిగింది. విరార్ (పశ్చిమ) ప్రాంతంలో 11 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలికను మభ్యపెట్టి..

Gang Rape: ముంబైలో గ్యాంగ్ రేప్.. 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేయాలని స్నేహితులను ప్రోత్సహించిన యువతి..
Gangrape
Amarnadh Daneti
|

Updated on: Aug 19, 2022 | 1:10 PM

Share

Gang Rape: దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నా.. రేపిస్టుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఏదో మూల ప్రతిరోజు మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆర్థిక రాజధాని ముంబైలో 11 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేయాలని ఓ యువతి యువకులను ప్రోత్సహించడం ఇక్కడ గమనర్హం. ఆలస్యంగా వెలుగుచూసిన ఈఅమానూష ఘటన ముంబైలో జరిగింది. విరార్ (పశ్చిమ) ప్రాంతంలో 11 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 11ఏళ్ల బాలికను మభ్యపెట్టి.. తన ముగ్గురు స్నేహితులతో అత్యాచారం చేయించింది 21 ఏళ్ల యువతి.

ఈనెల 16వ తేదీ మంగళవారం రాత్రి బాధిత బాలిక మొబైల్ ఫోన్ రిపేర్ కోసం ఇంటికి సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అక్కడ 21ఏళ్ల స్నేహితురాలుని కలుసుకుంది. బాలికను వాకింగ్ పేరుతో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన యువతి.. తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు అక్కడకి చేరుకున్నారు. మొదట ఒకరితో సెక్స్ లో పాల్గొనాలని యువతి బాలికను ఒత్తిడి చేస్తూ తీవ్రంగా కొట్టింది. తప్పించుకునేందుకు బాలిక ప్రయత్నించగా.. అక్కడున్న ముగ్గురు యువకుల్లో ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత.. మరో ఇద్దరు యువకులు బాలికను రేప్ చేశారు. నిందితులను అత్యాచారానికి ప్రోత్సహించిన 21ఏళ్ల యువతి సంఘటనను చూస్తూ అక్కడే ఉండిపోయింది.

బుధవారం ఉదయం బాధిత బాలికను ఆమె ఇంటి దగ్గర నిందితులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న బాలిక విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాధిత బాలిక తల్లి విరార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులతో పాటు..అత్యాచారానికి ప్రోత్సహించిన 21 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్నారు. మొదట ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. కొద్ది సేపటికే 3వ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు అందిన 6గంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు విద్యార్థి కాగా, మరొకరు కూరగాయల వ్యాపారిగా తెలిసింది. మూడో నిందితుడు డ్రగ్స్ వ్యాపారిగా పోలీసులు తెలిపారు. ఈ అమానవీయ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి