Telia Bhola: మత్య్సకారులు వలలో చిక్కిన అరుదైన భారీ చేప.. వేలంలో రూ.36 లక్షల ధర.. జాలర్లకు పండగే పండగ..

Telia Bhola Fish: మత్స్యకారులకు వేటకు వెళ్ళినప్పుడు చేపలు పడితే ఆరోజు సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అలాంటి అరుదైన భారీ చేప వలకు చిక్కితే..

Telia Bhola: మత్య్సకారులు వలలో చిక్కిన అరుదైన భారీ చేప.. వేలంలో రూ.36 లక్షల ధర.. జాలర్లకు పండగే పండగ..
Telia Bhola

Telia Bhola Fish: మత్స్యకారులకు వేటకు వెళ్ళినప్పుడు వలలో చేపలు పడితే ఆరోజు సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అరుదైన భారీ చేప వలకు చిక్కితే.. అప్పుడు ఆ జాలర్లకు పండగే. తాజాగా పశ్చిమ బెంగాల్‌ సుందర్ బన్ అడవుల సమీపంలో ఉన్న సుందర్ బన్ నదిలో ఓ భారీ చేప మత్స్యకారుల వలలో చిక్కుకుంది. ఈ చేప  7 అడుగుల పొడవు, 78.4 కిలోల బరువు ఉంది. అరుదైన ‘తెలియా భోలా ఫిష్’ గా గుర్తించారు.  తమ వలలో చిక్కుకున్న చేపను చూసి ఐదుగురు మత్స్యకారుల బృందం ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. వివరాల్లోకి వెళ్తే…

సుందర్ బన్ నదిలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుల బృందం వలలో ఓ భారీ చేప చిక్కుకుంది. దీనిని ఆ మత్య్సకారులు అతికష్టంతో  చేప ఉన్న వలను ఒడ్డుకు చేర్చారు.  ఈ చేప సాధారణ మనిషి ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుగా ఉంది. ఈ చేపను చూడడానికి స్తానికులు భారీగా తరలివచ్చారు.  భారీ చేపను క్యానింగ్ మార్కెట్‌కు వేలానికి తరలించారు. ఇంత భారీ చేపను వేలం కోసం మార్కెట్‌కు తీసుకురావడం ఇదే తొలిసారి అని ఓ మత్స్యకారుడు తెలిపారు. వేలంలో ఈ భోలా ఫిష్  రూ. 36, 53,605 ల ధర పలికింది. కోల్‌కతాకు చెందిన KMP అనే చేపల వ్యాపార  సంస్థ ఈ చేపను వేలంలో దక్కించుకుంది. వేలంలో కిలో రూ.47,880 చొప్పున అమ్ముడయ్యిందని క్యానింగ్‌లోని చేపల వ్యాపారి ప్రభాత్ చెప్పాడు.

 చేప ఎందుకు ఖరీదు అంటే.. 

ఈ చేపను ‘తెలియా భోలా’ అని పిలుస్తారు. అపారమైన ఔషధ విలువలు ఉన్నాయి.  ఔషధాల తయారీలో ఉపయోగించడానికి ఎగుమతి చేయబడుతుంది.  ఈ చేప చర్మానికి మంచి డిమాండ్ ఉంది. కిలో చర్మం దాదాపు రూ.80 వేలు ఉంటుందంటే ఈ చేపకున్న డిమాండ్‌ని అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఓ మత్స్యకారుడు రూ.1.33 కోట్ల విలువైన 157 ఘోల్ చేపలను పట్టుకుని కోటీశ్వరుడయ్యాడు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఘోల్ చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సముద్ర చేపలలో ఒకటి.

Also Read:  మళ్ళీ కనిపించిన ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..

 

Click on your DTH Provider to Add TV9 Telugu