Watch Video: వామ్మో ఇంతుందేంది భయ్యా.. ఇలాంటి పామును మీరు జన్మలో చూసుండరు.. పొడవెంతో తెలిస్తే..
చిన్నపామును చూస్తేనే మనం గజగజ వణికిపోతాం అలాంటి 14 అడుగుల కింగ్ కోబ్రా కనిపిస్తే ఇంకేమైనా ఉందా గుండె జారిపోవాల్సిందే.. ఇక్కడ కూడా అచ్చం అలాంటి అనుభూతినే ఎదుర్కొన్నారు కొందరు గ్రామస్తులు. గ్రామం సమీపంలోకి వచ్చిన 14 అడుగుల కింగ్ కోబ్రాను చూసి షాక్ అయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

న్నపామును చేస్తేనే మనం గజగజ వనికి పోతాం అలాంటి 14 అడుగుల కింగ్ కోబ్రా కనిపిస్తే ఇంకేమైనా ఉందా గుండెలు జారిపోవాల్సిందే.. ఇక్కడ కూడా అచ్చం అలాంటి అనుభూతినే ఎదుర్కొన్నారు కొందరు గ్రామస్తులు. గ్రామం సమీపంలోకి వచ్చిన 14 అడుగుల కింగ్ కోబ్రాను చూసి షాక్ అయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు స్నేక్ క్యాచర్ సహాయంతో దాన్ని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని పద్మపోఖరి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామ సమీపంలోని చెట్టు కింద నుండి చెరువు వైపు పాకుతున్న పెద్ద పామును చూశారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, స్నేక్ క్యాచర్‌ను తీసుకొని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువువైపు వెళ్తున్న 14 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత కింగ్ కోబ్రాను సిమిలిపాల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితమైన, ఏకాంత ప్రాంతంలో వదిలారు.
పాము పూర్తిగా ఆరోగ్యంగా ఉందని, దాని సహజ ఆవాసాలలోకి వదిలివేసినట్లు అధికారులు తెలిపారు. ఏదైనా ప్రాంతంలో ఇలాంటి పాములను చూసినట్లయితే భయపడవద్దని, వెంటనే సంబంధిత అధికారులకు లేదా స్నేక్ హెల్ప్‌లైన్‌కు నివేదించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా 14 అడుగుల భారీ కింగ్ కోబ్రా కనిపించడం జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అక్కడున్న జనాలు దాని దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
