AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తల్లి గుండెపగిలేలా ఏడుస్తున్నా.. పట్టించుకోకుండా వెళ్తున్న యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన..

ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు పెరిగిపోతున్నాయి. ఇంట్లోని పెద్దలు ఒప్పుకొకపోతే.. పారిపోయి మరి పెళ్లి చేసుకుంటున్నారు యువత. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కావాలని కోరుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చేసింది. ఓ జంట ప్రేమ పెళ్లి చేసుకొని పోలిస్‌ స్టేషన్‌కు వచ్చారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఒక యువతి, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి లివ్-ఇన్‌లో ఉండాలని నిర్ణయించుకుంది. వద్దని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆ అమ్మాయి మాత్రం పోలీసులతో కలిసి వెళ్లిపోయింది. సమాజంలో ఇలాంటి ఘటనలు పెరగడాన్ని ప్రస్తావిస్తూ ఓ ఎమ్మెల్యే ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral Video: తల్లి గుండెపగిలేలా ఏడుస్తున్నా.. పట్టించుకోకుండా వెళ్తున్న యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన..
Viral News
Noor Mohammed Shaik
| Edited By: Anand T|

Updated on: Oct 09, 2025 | 11:30 PM

Share

మన దేశంలో చట్టాలు ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు రూపొందించబడ్డాయి, కానీ ఒక చట్టం మాత్రం ప్రతి తల్లిదండ్రిని, ప్రతి అక్కాచెల్లెమ్మను భయంతో, ఆందోళనతో జీవించాల్సిన పరిస్థితిలోకి నెడుతోంది. ఈ చట్టం కారణంగా తల్లిదండ్రులు, కూతుళ్ల మధ్య ఉన్న భావోద్వేగ బంధం, అనుబంధం క్రమంగా క్షీణిస్తోంది. ప్రతి తల్లిదండ్రి మనసులో ఒకే ఆందోళన ఉంటుంది “నా కూతురు తప్పుదారిలో పడిపోతుందేమో? జీవితంలో బాధలు, కష్టాలు తెచ్చిపెట్టే వ్యక్తిని ప్రేమిస్తుందేమో?” అని ఇటీవల కోర్టుల్లో కూడా ఇలాంటి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కూతురు కనిపించకపోతే తల్లిదండ్రులు హేబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తున్నారు. కానీ కూతురు తిరిగి కనిపించినప్పుడు, తల్లిదండ్రులను కూడా గుర్తించడానికి నిరాకరిస్తోంది.

తాజాగా ఇలాంటి ఘటనే రాజస్థాన్‌లోని ఓసియాన్‌లో ఉన్న సామరావ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువతి ప్రేమ వివాహం చేసుకుని పోలీస్ రక్షణలో తన ప్రియుడి ఇంటికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె తల్లి గట్టిగా ఏడుస్తూ, ఆమెను అలా చేయవద్దని వేడుకుంటోంది. కానీ ఆ అమ్మాయి ముఖంలో తల్లిపట్ల కరుణ, ప్రేమ, అనురాగం ఏమీ కనిపించడం లేదు.

ఇటీవల ఓసియాన్ ఎమ్మెల్యే భైరారం సియోల్ ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ “ఇప్పుడు కేవలం యువతులు మాత్రమే కాదు, ముగ్గురు పిల్లల తల్లులు కూడా 120 స్పీడ్‌తో పారిపోతున్నారు” అని అన్నారు. ప్రేమ వివాహం చేసుకునే ముందు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేలా చట్టం ఉండాలని ఆయన పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై