Viral: రైలులో పోలీసులను చూడగానే తత్తరపాటుకు గురైన వ్యక్తి.. ఆపి చెక్ చేయగా..

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ప్రతీ భోగీలోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులను సైతం..

Viral: రైలులో పోలీసులను చూడగానే తత్తరపాటుకు గురైన వ్యక్తి.. ఆపి చెక్ చేయగా..
Railway Police
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 07, 2022 | 12:45 PM

ఈ మధ్యకాలంలో రైళ్లల్లో తనిఖీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాల సరఫరాను అడ్డుకునేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ప్రతీ భోగీలోనూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులను సైతం వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఘజియాబాద్ స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ వ్యక్తి కదలికలు వారికి అనుమానాస్పదంగా కనిపించింది. అతడ్ని పట్టుకుని చెక్ చేయగా.. పెద్ద డ్రగ్స్ దందా డొంకంతా కదిలింది.

వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా రూ. కోటి విలువైన హెరాయిన్ సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులతో కూడిన ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఘజియాబాద్ ఆర్‌పీఎఫ్ పోలీసులు. ఆ ముఠా సభ్యుల నుంచి 5 కేజీల హెరాయిన్, ఓ మారుతీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. యూపీలోని బరేలీకి చెందిన శ్యామ్ బిహారి, గవేంద్ర.. జార్ఖండ్‌కు చెందిన వినోద్ కుమార్ గుప్తా, యూపీలోని బాదౌన్‌కు చెందిన దేవేంద్ర, ఓ మహిళ.. ఈ డ్రగ్స్ ముఠాను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ‘వినోద్ కుమార్ తన చెల్లితో కలిసి ట్రైన్‌లో ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్‌ను శ్యామ్ బిహారీకి చేరవేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వారు ఇటీవల డ్రగ్స్ తీసుకెళ్తుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా ఆర్‌పీఎఫ్ పోలీసులకు చిక్కారు. శ్యామ్ బిహారీ చేతికి డ్రగ్స్ రాగానే.. అతడు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్‌లోని బయ్యర్స్‌కు కేజీ లక్షకు అమ్మేవాడని’ పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.