Geeta Samota: సాహసమే ఆమె ఊపిరి.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది.. చరిత్ర సృష్టించింది.!
Geeta Samota: మనలో లెక్కలేనంత ధైర్యం, చేయాలన్న తపన ఉంటే.. ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయొచ్చు. ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమంటే..
మనలో లెక్కలేనంత ధైర్యం, చేయాలన్న తపన ఉంటే.. ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయొచ్చు. ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ పనిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాలి. అయితే మనలో లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉంటే అన్నింటిలోనూ విజయం సాధించవచ్చు.
ఇవాళ భారత యువ ట్రెక్కర్ గీతా సమోటా ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించి సంచలనం సృష్టించింది. శిఖరాగ్రంపై భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించి.. ఔరా అనిపించింది. అతి తక్కువ రోజుల్లోనే కిలిమంజారోను అధిరోహించి భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటింది.
కాగా, గీతా సమోటా ఆగష్టు 13న యూరప్ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్ శిఖరాన్ని (5,672 మీటర్లు) అధిరోహించిన సంగతి తెలిసిందే. దీనితో రెండు పర్వతాలను అతి తక్కువ కాలంలో అధిరోహించిన ఫాస్టెస్ట్ ఇండియన్‌గా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. ఈమె చేసిన ఘనతను మెచ్చుకుంటూ టాంజానియాలోని హై-కమీషనర్ ఆఫ్ ఇండియా బినయా ప్రధాన్ ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.
Also Read:
- Funny Video: వధువుకు లైన్ వేస్తూ డ్యాన్స్ చేసిన యువకుడు.. వరుడు రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు!
- Viral Video: సింహం వేట మాములుగా లేదు.. క్షణాల్లో చిరుతను వేటాడి చంపేసింది.. వీడియో చూస్తే షాకే!
- జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ల్యాప్‌టాప్‌ల పంపిణీపై కసరత్తు.. అభ్యంతరాలకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే!
- సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏమన్నారంటే.!
- 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 12 బంతుల్లోనే ఫలితం.. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో విధ్వంసం..
Congratulations to @geeta_samota for successful summit of #MountKilimanjaro,highest peak in Africa;earned the title of Fastest Indian to do Dual Summit (Mt Elbrus on 13 Aug& Mt Kilimanjaro today) #IndiaTanzania @PMOIndia @DrSJaishankar @MOS_MEA @ianuragthakur @CISFHQrs @PTI_News pic.twitter.com/zWNmIrZyLN
— Binaya Pradhan (@binaysrikant76) September 11, 2021