Odisha Train Accident: గొప్ప మనసు చాటుకున్న గౌతమ్‌ అదానీ.. వారందరికీ ఉచిత విద్య అందిస్తామని ప్రకటన

|

Jun 04, 2023 | 7:23 PM

ఒడిశా రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 288 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదం ఎందరి జీవితాలనో శూన్యంలోకి నెట్టేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కొందరైతే, పిల్లల్ని కోల్పోయిన పేరెంట్స్‌ మరికొందరు. ఇలా...

Odisha Train Accident: గొప్ప మనసు చాటుకున్న గౌతమ్‌ అదానీ.. వారందరికీ ఉచిత విద్య అందిస్తామని ప్రకటన
Gautam Adani
Follow us on

ఒడిశా రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 288 మంది మరణించారు. వెయ్యి మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదం ఎందరి జీవితాలనో శూన్యంలోకి నెట్టేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కొందరైతే, పిల్లల్ని కోల్పోయిన పేరెంట్స్‌ మరికొందరు. ఇలా ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసిందీ ప్రమాదం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాను ప్రకంటించింది. ఇక ఆయా రాష్ట్రా ప్రభత్వాలు సైతం తమ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులకు పరిహారాన్ని అందించి ఆదుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ కూడా ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. రైలు ప్రమాదంలో తమ తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తాము ఉచిత స్కూలు విద్యా సౌకర్యాన్ని అందించే బాధ్యతను చేపడతామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ విషయాన్ని గౌతమ్‌ అదానీ స్వయంగా ప్రకటించారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..