Gandhi Jayanti 2021: పోరాటానికి అహింస, సత్యాగ్రహమే చాలని కొత్త యిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గాంధీజీ

Gandhi 152 Jayanti : సత్యాన్ని ఆచరించడమే గాంధీయిజం... గాంధీజీ గొప్పదనం దేశానికి స్వాతంత్య్రం తేవడంలో లేదు... అయన తన సత్యం అహింసను ఆయుధం గా చేసుకుని గాంధీ గిరి అనే ఒక సంస్కృతిని...

Gandhi Jayanti 2021: పోరాటానికి అహింస, సత్యాగ్రహమే చాలని కొత్త యిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గాంధీజీ
Gandhi Ism

Edited By: Janardhan Veluru

Updated on: Oct 02, 2021 | 6:56 AM

Gandhi 152 Jayanti : సత్యాన్ని ఆచరించడమే గాంధీయిజం… గాంధీజీ గొప్పదనం దేశానికి స్వాతంత్య్రం తేవడంలో లేదు… అయన తన సత్యం అహింసను ఆయుధం గా చేసుకుని గాంధీ గిరి అనే ఒక సంస్కృతిని.. ఒక జాతిగా తీర్చిదిద్దారు. ఆనాడు గాంధీ గారి పిలుపుతో యెంతో మంది విద్యాధికులతో పాటు, చదువు రాని వారు కూడా తమ ఆస్థిపాస్థులను వదిలేసి స్వాతంత్రం కోసం పోరాడారు.. తమ వుద్యమాలతో బ్రిటీషు వారిని తరిమి కొట్టడానికి ఆయుధాలు అఖ్ఖర్లేదని అహింస, సత్యగ్రహమే చాలని కొత్త అర్ధం చెప్పి గాంధియిజాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని గాంధీ అమలు చేసి… పని సాధించుకునే ఒక ఆయుధంగా మలచుకున్నారు. ఐతే సత్యాగ్రహం ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం మాత్రమే కాదు… నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము ఒక చెంపను కొడితే.. మరో చెంపను చూపించేటంతటి సహనం గాంధీ సొంతం… మనదేశంలా అనేక దేశాలు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాయి.. కానీ రక్తం బొట్టు చిందించ కుండా మన సంపాదించుకున్న స్వాతంత్యం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.

గాంధీ అనుసరించిన సత్యాగ్రహం యొక్క ముఖ్యఉద్దేశం సమాజంలోని వైరుధ్యాలు తొలగించడమే కాదు… వైరుధ్యం కలిగించేవారికి హాని చేయకుండా వారిలో మార్పు తెచ్చి వారి నైతికస్తాయిని పెంచడం.. గాంధీ అనుసరించిన సత్యాగ్రహం ను నెల్సన్ మండేలా వంటి వారు ఆచరించి… దక్షిణా ఆఫ్రికాకు స్వాతంత్యాన్ని సాధించారు… గాంధీయిజం యొక్క గొప్పదనంను మరో సారి ప్రపంచానికి చాటి చెప్పారు.. నల్లజాతి సూరీడు నెల్సన్

చిన్నతనంలో చూసిన సత్య హరిచంద్ర, శ్రవణ కుమారుడి నాటకాలు గాంధీపై అమితమైన ప్రభావం చూపాయి. ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం గాంధీజీ ని బాల్యంలో ఆకర్షించింది. ఇక ఆయన ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలను చదివినా గాంధీ పై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీత. గీతా పఠనం వల్ల ఆయనకు ఆత్మజ్ఞానము యొక్క ప్రాముఖ్యత, కర్మ విధానం తెలిసింది. దీంతో గాంధీ మనిషి యొక్క జీవిత ప్రయాణంలో సత్యం, అహింస యొక్క ప్రాముఖ్యతను… తెలుసుకున్నారు. అహింసను కనిపెట్టినది గాంధీజీ కాదుగాని, అహింసను భారీస్థాయిలో రాజకీయాలలో మొదట ఉపయోగించిన వ్క్యక్తి గాంధీజీ.

ప్రథమ, ద్వితీయ ప్రపంచం సంగ్రామాలు తన జీవితకాలంలో చూసిన గాంధీజీ సత్యం, శాంతి, అహింస ఈ మూడింటిని నమ్ముకుని ఆచరించి చూపించారు. జనజీవన శ్రేయస్సుకు మార్గదర్శకులయ్యారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఓ వ్యక్తి.. శక్తిగా ఎదగడం గాంధీ జీవితం నేర్పిన గొప్ప పాఠం.. సత్యం, అహింస ను ఆచరించడంలో గాంధీజీ ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా వాటిని ఆచరించి… జీవించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు.

Also Read:

Aadhaar: ప్రజలకు శుభవార్త.. భారీగా ఆధార్‌ అథెంటికేషన్‌ ఛార్జీల తగ్గింపు.. ఎంత అంటే..!