G20 Tourism Summit: ఎన్ఎస్‌జీ, మార్కోస్ గుప్పిట్లో శ్రీనగర్‌.. జీ20 టూరిజం సదస్సు ముందు భారీ ఉగ్రకుట్ర భగ్నం..

జమ్ముకశ్మీర్‌లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జీ20 టూరిజం సదస్సుపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి భద్రతా బలగాలు. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌తో పాటు సందర్శించే ప్రాంతాల దగ్గర కమెండోలతో భద్రతను ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌లో జీ20 టూరిజం సదస్సుకు ముందు భారీ ఉగ్రకుట్ర బయటపడింది. గుల్‌మార్గ్‌లో విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌ను

G20 Tourism Summit: ఎన్ఎస్‌జీ, మార్కోస్ గుప్పిట్లో శ్రీనగర్‌.. జీ20 టూరిజం సదస్సు ముందు భారీ ఉగ్రకుట్ర భగ్నం..
G20 Tourism Summit

Edited By: Shaik Madar Saheb

Updated on: May 25, 2023 | 9:13 AM

జమ్ముకశ్మీర్‌లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జీ20 టూరిజం సదస్సుపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి భద్రతా బలగాలు. విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌తో పాటు సందర్శించే ప్రాంతాల దగ్గర కమెండోలతో భద్రతను ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌లో జీ20 టూరిజం సదస్సుకు ముందు భారీ ఉగ్రకుట్ర బయటపడింది. చైనా, పాకిస్తాన్ చేసిన కుట్రను ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్.. భద్రతా దళాలను రంగంలోకి దించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఎన్ఎస్‌జీ, మార్కోస్ లాంటి పటిష్టమైన భద్రతా దళాలను మోహరించాయి. చీమ చిటుక్కుమన్నా, ఏమాత్రం అనుమానం వచ్చినా అలర్ట్ అయ్యేలా శ్రీనగర్‌ను అదుపులోకి తీసుకున్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ను అడ్డుకుని.. అభివృద్ధిని నిరోధించేలా.. చేస్తున్న కుట్రలను ముందే ఊహించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉగ్రవాదులకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. పలు దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల్లో ఆందోళన కలిగించేలా ఏదో ఒకటి చేయాలన్న ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ముంబై తరహాలో ఉగ్ర కుట్ర చేయాలన్న టెర్రరిస్టుల ప్లాన్ ను భద్రతదళాలు అడ్డుకుని.. జీ20 సమ్మిట్ విజయవంతం అయ్యేలా కృషి చేశాయి. ప్రతి కదలికను పసిగట్టేలా ఎన్ఎస్‌జీ, మార్కోస్ (నీటి యుద్ధ వీరులు) సభ జరిగే ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. గుల్‌మార్గ్‌లో విదేశీ ప్రతినిధులు బస చేసే హోటల్‌ను టెర్రరిస్టులు టార్గెట్‌ చేసినట్టు నిఘావర్గాలు పసిగట్టాయి. దీంతో జీ 20 టూరిజం ప్రతినిధుల బస చేసే హోటల్‌ వేదికను మార్చారు. గుల్‌మార్గ్‌ నుంచి వేరే ప్రాంతానికి వేదికను అప్పటికప్పుడు మార్చారు.

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్ర..

గుల్‌మార్గ్‌లో ముంబై తరహా దాడులు చేయాలని పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారు. హోటల్‌లో పనిచేసే ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినప్పుడు ఈ వ్యవహారం బయటపడింది. శ్రీనగర్‌లో సోమవారం , మంగళవారం జీ20 సదస్సు జరుగుతుంది. దాదాపు 60 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే జీ20 సదస్సును భగ్నం చేయడానికి ఐఎస్‌ఐ సంస్థ కుట్ర చేసింది.

దాల్‌ సరస్సులో కమెండోలతో భద్రత..

ఐఎస్‌ఐ కుట్ర బయటపడడంతో శ్రీనగర్‌లో జీ20 వేదిక దగ్గర భద్రతను పెంచారు. ప్రతినిధులు పర్యటించే ప్రాంతాల్లో ఎన్ఎస్‌జీ, దాల్‌ సరస్సులో మార్కోస్ కమెండోలతో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జమ్ములో కూడా భద్రతను పెంచారు. చినాబ్‌ నదిలో కూడా మార్కోస్ (మెరైన్‌ కమెండో)లతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

జీ20 దేశాల ప్రతినిధులపై ఆత్మాహుతి దాడికి కుట్ర..

కశ్మీర్‌కు వచ్చే జీ20 దేశాల ప్రతినిధులపై ఆత్మాహుతి దాడికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి మూడు చోట్ల దాడులకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. డ్రోన్లతో , సీసీటీవీలతో శ్రీనగర్‌లో భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌లో జీ20 సదస్సును కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడకుండా సదస్సును సక్సెస్‌ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..