ఒక సాధారణ కార్యకర్తగా మొదలై దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏ పదవి చేపట్టినా వాటికి వన్నె తీసుకొచ్చారాయన. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజలకు సేవలందించిన కిషన్ రెడ్డి దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రతిభను చాటిచెప్పారు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించారు కిషన్ రెడ్డి. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమో చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో జనతా పార్టీలో చేరారు. 1977లో జనతా పార్టీలో యూత్ లీడర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. మొదట రంగా రెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా కన్వీనర్‌గా సేవలందించారు. 2004లో బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన అదే ఏడాది హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2009లో ఓడిపోయినా.. 2014లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అదే ఏడాది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆ మరుసటి ఏడాది సికింద్రాబాద్ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈక్రమంలో బీజేపీకి కిషన్ రెడ్డి అందించిన సేవలను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019లో ఆయనకు హోం శాఖ సహాయమంత్రిగా స్థానం కల్పించారు. ప్రస్తుత క్యాబినేట్‌లో కూడా సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రిగా సేవలందిస్తున్నారాయన.
ఇలా సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగిన కిషన్ రెడ్డి ఇవాళ (జూన్ 15) పుట్టిన రోజు శుభాకాంక్షలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షాతో సహా పలువురు ప్రముఖులు కిషన్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పారు. ‘ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశంలో పర్యాటక రంగాన్ని మెరుగుపర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవుడని ప్రార్థిస్తున్నాను’ అని మోడీ ట్వీట్ చేశారు. మోడీతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జై శంకర్, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, స్పీకర్ ఓం బిర్లా తదితరులు కిషన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
Thank you Hon’ble PM Shri @NarendraModi ji.
Your blessings and guidance are a great source of strength and will add more vigour to my commitment towards contributing for Maa Bharati. https://t.co/RydmAcedFx— G Kishan Reddy (@kishanreddybjp) June 15, 2023
Thank you Adarniya Shri @AmitShah Ji.
Your wishes inspire me to strive with a renewed commitment towards achieving the goals of #NewIndia https://t.co/GQE0WIo0Dg
— G Kishan Reddy (@kishanreddybjp) June 15, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..