హోం ఐసోలేషన్‌ తప్పనిసరి.. బీఎంసీ కీలక నిర్ణయం

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ముంబయి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబయి నగరానికి వచ్చిన ప్రయాణికులు ఎవరైనా 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో

హోం ఐసోలేషన్‌ తప్పనిసరి.. బీఎంసీ కీలక నిర్ణయం

BMC isolation rules: కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ముంబయి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబయి నగరానికి వచ్చిన ప్రయాణికులు ఎవరైనా 14 రోజుల పాటు తప్పనిసరిగా హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు బృహాన్ ముంబయి కార్పొరేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఎవరైనా దీని నుంచి మినహాయింపు పొందాలనుకుంటే మాత్రం రెండు రోజుల ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని బీఎంసీ ట్విట్టర్‌లో వెల్లడించింది.

కాగా ఇటీవల సుశాంత్‌ మృతి కేసును విచారించేందుకు పట్నా నుంచి ముంబయికి వెళ్లిన ఓ పోలీస్ అధికారిని అధికారులు బలవంతంగా హోం క్వారంటైన్‌లో ఉంచిన విషయం తెలిసిందే. దీనిపై పలు విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ముంబయి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 4,79,779కు చేరగా.. వారిలో 3,16,375 మంది డిశ్చార్జ్ అయ్యారు. 16,792 మంది మృతి చెందారు.

Read This Story Also: ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యకు కరోనా పాజిటివ్‌

Click on your DTH Provider to Add TV9 Telugu