Road Accident: ప్రైవేటు బస్సు వేగంగా ఢీకొట్టిన ఘటనలో నలుగురు రైతులు దుర్మరణం
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ప్రయివేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టిన ఘటనలో నలుగురు రైతులు చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
Karnataka: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ప్రయివేటు బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టిన ఘటనలో నలుగురు రైతులు చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని టుముకూర్-శివమొగ్గ హైవేపై జరిగింది. వాయు వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు.. లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగిపోయింది.
దీంతో వాహనంలో ప్రయాణిస్తోన్ననలుగురు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలపాలైన మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు.
బస్సు హసన్ నుంచి అరసికేరే వైపు వెళ్తుండగా.. టుముకూర్ నుంచి వచ్చిన వాహనం ఢీ కొట్టినట్లు పోలీసులు వివరించారు. ఈ వాహనంలో రైతులు పూలను తీసుకెళ్తున్నట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలో ఉండే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. స్థానికుల సాయంతో వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read also: Balakrishna: సీమకు మిగులు జలాలు కాదు.. నికర జలాలు కేటాయించాలి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ