ప్రభుత్వ బంగళా ఖాళీ చేసిన సుష్మా

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం తనా నివసిస్తున్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేశారు. సెంట్రల్ ఢిల్లిలోని సఫ్దర్ జంగ్‌లేన్‌లో ఉన్న 8వ నంబరు బంగళాను తాను ఖాళీ చేస్తున్నట్లు ఆమె ట్వీట్‌ చేశారు. తన ఇంటి చిరునామాతోపాటు ఫోన్ నంబర్లు కూడా మారతాయని ఆమె తెలిపారు. అనారోగ్యం కారణంగానే గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నానని వెల్లడించారు. కేంద్రమంత్రిగా ట్విట్టర్‌లో పాపులర్ అయిన సుష్మా.. బంగళాను వదలడంతోపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే సుష్మాకు గవర్నర్ […]

ప్రభుత్వ బంగళా ఖాళీ చేసిన సుష్మా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2019 | 5:02 PM

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం తనా నివసిస్తున్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేశారు. సెంట్రల్ ఢిల్లిలోని సఫ్దర్ జంగ్‌లేన్‌లో ఉన్న 8వ నంబరు బంగళాను తాను ఖాళీ చేస్తున్నట్లు ఆమె ట్వీట్‌ చేశారు. తన ఇంటి చిరునామాతోపాటు ఫోన్ నంబర్లు కూడా మారతాయని ఆమె తెలిపారు. అనారోగ్యం కారణంగానే గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నానని వెల్లడించారు. కేంద్రమంత్రిగా ట్విట్టర్‌లో పాపులర్ అయిన సుష్మా.. బంగళాను వదలడంతోపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే సుష్మాకు గవర్నర్ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని పలువురు బీజేపీ నేతలు భావిస్తున్నారు.