AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది దుర్మరణం

ఢిల్లీలోని మాలవీయ నగర్‌లోని లెమన్ రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 21 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. మరో 30 మంది లోపల చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 21 మంది దుర్మరణం
Delhi Fire Accident
SN Pasha
|

Updated on: Jun 03, 2026 | 3:41 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్‌లోని ఓ రెస్టారెంట్లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 21 మంది వరకు మరణించగా.. 40 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రెస్టారెంట్ భవనంలో మరో 30 వరకు చిక్కుకొని ఉన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం లెమన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిందని తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. రెస్టారెంట్‌లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ఎక్స్ గ్రేషియా ప్రకటన

మాల్వీయా నగర్ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అగ్నిప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు, బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.

Follow Us