AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కన్నకొడుకునే హత్య చేసిన తండ్రి.. ఎలా జరిగిందంటే

ముంబయిలోని ఓ తండ్రి తన రెండేళ్ల కుమారుడిపై కక్ష గట్టాడు. వివాహేతర సంబధానికి అడ్డుగా ఉన్నాడని ఆ చిన్నారి గొంతునులిమి హత్య చేశాడు. వివరాల్లకి వెళ్తేధారావిలో నివసిస్తున్న నిందితుడు(22) ఓ దుస్తుల ఫ్యాక్టరీలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కన్నకొడుకునే హత్య చేసిన తండ్రి.. ఎలా జరిగిందంటే
Child
Aravind B
|

Updated on: Apr 20, 2023 | 1:20 PM

Share

ముంబయిలోని ఓ తండ్రి తన రెండేళ్ల కుమారుడిపై కక్ష గట్టాడు. వివాహేతర సంబధానికి అడ్డుగా ఉన్నాడని ఆ చిన్నారి గొంతునులిమి హత్య చేశాడు. వివరాల్లకి వెళ్తేధారావిలో నివసిస్తున్న నిందితుడు(22) ఓ దుస్తుల ఫ్యాక్టరీలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే తనను పెళ్లిచేసుకోవాలంటే అతడి భార్య, కుమారుడి అడ్డు తొలగించాలంటూ అతనికి ఆమె షరతు విధించింది. దీంతో ఆమెను ఎలాగైన పెళ్లి చేసుకోవాలని భావించిన నిందితుడు భార్య, కుమారుడిని హత్యచేయాలని కుట్ర పన్నాడు. చాక్లెట్‌ కొనిస్తానని చెప్పి భార్య నుంచి తన కుమారుడ్ని బయటకు తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలుడ్ని తమ కుటుంబానికి చెందిన దుకాణం వద్దకు తీసుకొచ్చాడు.

ఎవరూ లేని సమయాన్ని చూసి ఒక్కసారిగా ఆ చిన్నారి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం రాత్రి పూట మృతదేహాన్ని మీఠీ నదిలో పడేశాడు.అయితే ఆ బాలుడు కనిపించకపోవడంతో బంధువులు బుధవారం రోజున ఉదయం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నదిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం ప్లాస్టిక్‌ బ్యాగుతో కప్పి ఉందని తల, చేయి భాగాన్ని ఎలుకలు కొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలుడి తండ్రే హంతకుడని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?