AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదానికి ఊతమిస్తున్న డిజిటల్ విధానాలు.. FATF 2025 రిపోర్ట్‌లో సంచలన అంశాలు.. ఆ రిపోర్ట్‌లో ఇంకా ఏం ఉందంటే?

తాజా FATF నివేదిక పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తోందని వెల్లడించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం, ప్రభుత్వ పాత్రపై నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం అందడంపై ఈ నివేదిక దృష్టి పెట్టింది.

ఉగ్రవాదానికి ఊతమిస్తున్న డిజిటల్ విధానాలు.. FATF 2025 రిపోర్ట్‌లో సంచలన అంశాలు.. ఆ రిపోర్ట్‌లో ఇంకా ఏం ఉందంటే?
Fate
Mahatma Kodiyar
| Edited By: SN Pasha|

Updated on: Jul 14, 2025 | 7:54 AM

Share

ఆధునిక యుగంలో యుద్ధాలు తమ రూపాలు మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు వ్యక్తుల శారీరక దారుఢ్యం, యుద్ధ కళల్లో నైపుణ్యం ఆధారంగా యుద్ధాలు జరగ్గా.. తర్వాతికాలంలో దూరం నుంచే శత్రువును దెబ్బతీసే ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి. నేటి ఆధునిక యుగంలో అధునాతన ఆయుధాలతో పాటు మతోన్మాదం – ఉగ్రవాదం కూడా ఒకరకమైన యుద్ధ రూపంగా మారిపోయింది. ముఖ్యంగా భారతదేశానికి పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదాన్నే ఆయుధంగా మలచుకుని భారత్‌పై అనేక కుట్రలకు పాల్పడుతూ వస్తోంది. ఈ విషయాన్ని భారత్ అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ వేదికలపై చెబుతుండగా.. ఆ వాదనలకు బలం చేకూర్చే ఒక కీలక నివేదిక తాజాగా విడుదలైంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) తన తాజా నివేదిక “Comprehensive Update on Terrorist Financing Risks”లో ఉగ్రవాద ఆర్థిక సహాయంలో కొన్ని దేశాల్లో ప్రభుత్వాల పాత్ర, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నివేదికలో ఉగ్రవాదులు ఆర్థిక వ్యవస్థలను దుర్వినియోగం చేసే సంక్లిష్ట పద్ధతులను వెల్లడించడమే కాకుండా, ప్రభుత్వాల ద్వారా ఉగ్రవాద సంస్థలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతోందని మొదటిసారిగా గుర్తించింది. ఈ నివేదిక భారతదేశం దీర్ఘకాలంగా వ్యక్తపరుస్తున్న ఆందోళనలకు బలం చేకూర్చింది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న లష్కర్-ఎ-తోయిబా (LeT), జైష్-ఎ-మొహమ్మద్ (JeM) వంటి ఉగ్రవాద సంస్థలకు ఆ దేశ పాలకుల నుంచే అందుతున్న ఆర్థిక సహాయంపై అంతర్జాతీయ వేదికలపై భారత్ చేస్తున్న ఆరోపణలు నిజమని నివేదికలోని అంశాలు వెల్లడిస్తున్నాయి.

ఇంతకీ FATF అంటే ఏమిటి?

FATF అనేది 1989లో G7 సమ్మిట్‌లో ఏర్పాటైన ఇంటర్-గవర్నమెంటల్ సంస్థ. ఇది ధనార్జన, ఉగ్రవాద ఆర్థిక సహాయం, భారీ విధ్వంసక ఆయుధాల వ్యాప్తికి ఊతమిచ్చే ఆర్థిక సహాయాన్ని నిరోధించడానికి విధానాలను రూపొందిస్తుంది. భారతదేశం 2010లో సభ్యత్వం పొందింది. 2024లో ఆర్థిక స్థిరత్వం, సమగ్రతకు ‘అత్యుత్తమ’ రేటింగ్‌ను కూడా అందుకుంది. భారతదేశంలోని ‘నాన్-ప్రాఫిట్’ సంస్థల ద్వారా ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సహాయం గురించి FATF హెచ్చరించింది. దీని ఫలితంగానే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) వంటి కొన్ని NGOలను భారత ప్రభుత్వం నిషేధించింది.

గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్

పాకిస్థాన్ 2008, 2012-2015, మరియు 2018-2022లో FATF గ్రే లిస్ట్‌లో ఉంది. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన లోపాలు ఉన్నాయని దానర్థం. ఈ కాలంలో, లష్కర్-ఎ-తోయిబా నాయకుడు జకీ-ఉర్-రెహమాన్ లఖ్వీకి ఐదేళ్లు, హఫీజ్ సయీద్‌కు 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. అలాగే 2020లో యాంటీ-టెర్రరిజం యాక్ట్ (అమెండ్‌మెంట్) బిల్‌ను అమలు చేసింది. ఇది ఉగ్రవాద ఆర్థిక సహాయంపై అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయినప్పటికీ పాకిస్థాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలు ఇంకా పూర్తి కాలేదని, ఉగ్రవాద ఆర్థిక సహాయం రహస్యంగా కొనసాగుతోందని FATF నివేదిక సూచిస్తుంది.

మొదటిసారిగా, FATF నివేదిక ప్రభుత్వాలు, పాలకులను ఉగ్రవాద ఆర్థిక సహాయంలో ఒక ప్రధాన ప్రమాదంగా గుర్తించింది. అయితే దీనికి నిర్దిష్ట టైపాలజీని ఇంకా అభివృద్ధి చేయలేదు. ఈ నివేదిక పాకిస్థాన్‌ను నేరుగా పేర్కొనకపోయినప్పటికీ లష్కర్-ఎ-తోయిబా (LeT), జైష్-ఎ-మొహమ్మద్ (JeM), తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) వంటి పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు ప్రభుత్వాల నుంచి నేరుగా ఆర్థిక, లాజిస్టికల్, శిక్షణ సహాయాన్ని అందుకుంటున్నాయని ఈ నివేదిక సూచిస్తోంది. భారతదేశం అనేక అంతర్జాతీయ వేదికలపై గత కొన్నేళ్లుగా ఇదే మాట చెబుతూ వస్తోంది. ముఖ్యంగా 2022లో జాతీయ రిస్క్ అసెస్‌మెంట్ (NRA)లో పాకిస్థాన్‌ను ఉగ్రవాదుల కర్మాగారంగా పేర్కొంటూ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ఆయుధంగా తయారు చేస్తోందని విమర్శించింది.

డిజిటల్ మార్గాల దుర్వినియోగం: పుల్వామా ఉదాహరణ

కాశ్మీర్ లోయలోని పుల్వామా వద్ద 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడికి జైష్-ఎ-మొహమ్మద్ (JeM) పథక రచన చేసి అమలు పరిచిందన్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆత్మాహుతి బాంబు దాడిలో 40 CRPF సిబ్బంది మరణించారు. ఈ దాడికి ఉపయోగించిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED)లో కీలకమైన భాగమైన అల్యూమినియం పౌడర్‌ను అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేశారని నివేదిక వెల్లడించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తులో శ్రీనగర్ నివాసి వైజ్-ఉల్-ఇస్లామ్ ఈ పౌడర్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. దీనిని దాడి ప్రధాన సూత్రధారి ఉమర్ ఫరూఖ్ ఉపయోగించాడు. ఈ సంఘటన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఉగ్రవాద సామగ్రి కొనుగోలుకు ఎలా దుర్వినియోగం కావచ్చో స్పష్టం చేసింది.

గోరఖ్‌నాథ్ దేవాలయ దాడి (2022)

2022 ఏప్రిల్ 3న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ దేవాలయంపై ISIL-ప్రేరిత వ్యక్తి జరిపిన దాడిలో ఉగ్రవాది VPNలను ఉపయోగించి తన గుట్టు బయటపడకుండా దాచినట్టు తేలింది. అలాగే PayPal ద్వారా ₹6.69 లక్షలను అంతర్జాతీయంగా బదిలీ చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్రవాది 44 అంతర్జాతీయ థర్డ్-పార్టీ లావాదేవీలను నిర్వహించాడు. ఇందులో ISIL-సంబంధిత వ్యక్తులకు నిధులు పంపడం ఉంది. ఇతగాడి అనుమానాస్పద లావాదేవీలను గమనించిన Pay mia సదరు ఉగ్రవాది ఖాతాను సస్పెండ్ చేసింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం

FATF నివేదిక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆన్‌లైన్ చెల్లింపు సేవలు, VPNలు, సోషల్ మీడియా, క్రౌడ్‌ఫండింగ్ సైట్‌లు ఉగ్రవాద నిధుల సేకరణతో పాటు బదిలీ, నిర్వహణకు ఎలా దుర్వినియోగం అవుతున్నాయో వివరిస్తుంది. ఉదాహరణకు ఉగ్రవాదులు ఆయుధాలు, రసాయనాలు, 3D ప్రింటింగ్ సామగ్రిని కొనుగోలు చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. అలాగే, ట్రేడ్-బేస్డ్ మనీ లాండరింగ్ ద్వారా, వస్తువులను కొనుగోలు చేసి, వాటిని వేరే దేశంలో విక్రయించడం ద్వారా నిధులను బదిలీ చేస్తున్నారు.

ఇతర ఆర్థిక మార్గాలు

హవాలా & క్రిప్టోకరెన్సీ: ఉగ్రవాదులు హవాలా వ్యవస్థను డిజిటల్ రూపంలో ఉపయోగిస్తున్నారు, ఇందులో క్రిప్టోకరెన్సీ ఆధారిత బ్లాక్‌చైన్ లావాదేవీలు ఉన్నాయి. ఇవి గుర్తింపును దాచడానికి సహాయపడతాయి.

సోషల్ మీడియా మానిటైజేషన్: జూమ్, యూట్యూబ్, X వంటి ప్లాట్‌ఫామ్‌లలో బ్లూ టిక్ ఖాతాలు, సూపర్ చాట్ ఫీచర్‌లను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటు్నారు. ముఖ్యంగా నిధుల సేకరణకు ఉపయోగిస్తున్నారు.

షెల్ కంపెనీలు, నకిలీ స్వచ్ఛంద సంస్థలు: LeT, JeM వంటి సంస్థలు స్వచ్ఛంద సంస్థల పేరుతో నిధులను సేకరిస్తున్నాయి. మానవతా సహాయం పేరుతో సేకరించిన నిధులను ఉగ్రవాదం కోసం దుర్వినియోగం చేస్తున్నాయి.

భారత కౌంటర్-టెర్రరిజం యాక్షన్ ప్లాన్

భారతదేశం 2022 నేషనల్ రిస్క్ అసెస్‌మెంట్ (NRA)లో పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా పేర్కొంది. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న లావాదేవీలపై మెరుగైన జాగ్రత్తలను అనుసరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడి తర్వాత, భారతదేశం పాకిస్థాన్‌ను FATF గ్రే లిస్ట్‌లోకి తిరిగి చేర్చాలని ప్రపంచ బ్యాంక్ తో పాటు FATF పై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారతదేశం, ఈ దాడులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని FATFకు సమాచారం అందించింది.

సవాళ్లు, సిఫార్సులు

ఈ నివేదిక భద్రతా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం, ప్రభుత్వాలు, పాలకులే ఉగ్రవాదానికి నిధులు అందజేయడం వంటి అంశాలను గుర్తించింది. ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు ఈ క్రింది చర్యలను తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది:

  • డిజిటల్ లావాదేవీలపై కఠినమైన నిఘా.
  • ఈ-కామర్స్, డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫామ్‌ల కోసం గట్టి KYC నిబంధనలు.
  • ఉగ్రవాద ఆర్థిక సహాయాన్ని అరికట్టడానికి అంతర్జాతీయ సహకారం.

మొత్తంగా పాకిస్తాన్ ఉగ్రవాద కర్మాగారం అన్న విషయాన్ని చివరకు FATF తన పరిశీలనలో గుర్తించడం భారత్ సాధించిన గొప్ప విజయంగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు, గ్రాంట్ల రూపంలో నిధులు అందకుండా అడ్డుకోవడం సాధ్యపడుతుందని, అలాగే అంతర్జాతీయ ఒత్తిళ్లు ఆ దేశంపై పెరిగి ఉగ్రవాదులకు సహాయం అందకుండా చేస్తాయని భారత్ ఆశిస్తోంది. ఒకవేళ అలా జరగకపోతే.. ఆపరేషన్ సింధూర్ తరహాలో మరిన్ని ఆపరేషన్లకు భారత్ నడుం బిగించాల్సి వస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
కిలో ఉల్లి రూ.15లకే.. కొనేందుకు ఎగబడ్డ జనాలు! గంటలో కాసుల వర్షం..
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
ఈ బియ్యం తింటే పీసీవోఎస్ మాయం.. బరువు కంట్రోల్..!
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
11 సిక్సర్లతో 233 పరుగులు.. తొలి టీ20ఐ నుంచి సూర్య ఔట్..?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
దివ్వెల మాధురి పరువు తీసేసిన రీతూ తల్లి.. మరీ అలా అనేసిందేంటి?
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
మీ చేతిలో ఇలాంటి చిహ్నాలు ఉన్నాయంటే.. డబ్బు వద్దన్నా వెంటపడుతుంది
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం.. ఆ ఒక్కరోజు మాత్రమే చూసే అవకాశం..
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.!
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
చలి మీ అందాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
క్యాన్సర్ రోగుల కోసం కురులు దానం చేసిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో