AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు “ఎన్‌హెచ్‌ఏఐ” బంపర్ ఆఫర్.. కేవలం వారం మాత్రమే..

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ వాహనానికి అయితే ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ లేదో.. ఇక వారికి ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. వారి ప్రతీ అకౌంట్‌కు సెక్యూరిటీ డిపాజిట్ కూడా కల్పించనుంది. వాహనదారులందరూ ఈ ఫాస్ట్ ట్యాగ్ (ఎలక్ట్రానిక్ టోల్ పద్దతి)కి మొగ్గుచూపేందుకు కేంద్రం ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్‌ కేవలం డిసెంబర్ 1 వరకు మాత్రమేనని తెలిపింది. కాగా, కేంద్ర ప్రభుత్వం […]

వాహనదారులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్.. కేవలం వారం మాత్రమే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 23, 2019 | 8:05 PM

Share

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ వాహనానికి అయితే ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ లేదో.. ఇక వారికి ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. వారి ప్రతీ అకౌంట్‌కు సెక్యూరిటీ డిపాజిట్ కూడా కల్పించనుంది. వాహనదారులందరూ ఈ ఫాస్ట్ ట్యాగ్ (ఎలక్ట్రానిక్ టోల్ పద్దతి)కి మొగ్గుచూపేందుకు కేంద్రం ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్‌ కేవలం డిసెంబర్ 1 వరకు మాత్రమేనని తెలిపింది.

కాగా, కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలను దాటే ప్రతీ వాహనానికి డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. కేంద్రం వాహనదారులను ప్రోత్సహించేందుకు ఈ ఉచిత ఆఫర్ ప్రవేశపెట్టింది. అంతేకాదు.. ఈ ఫాస్ట్ ట్యాగ్‌లు ఇచ్చేందుకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేసింది.

ఏంటి ఈ ఫాస్ట్ ట్యాగ్..

ఫాస్ట్ ట్యాగ్.. దూర ప్రయాణాలు చేసే ప్రతి వాహనదారుడికి తెలిసిందే. ఇది వాహనదారుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రయాణ సమయంలో ఈ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే.. ఎంతో సమయం కలిసివస్తుంది. ఎందుకంటే.. హైవేలపై మధ్య మధ్యలో టోల్ గేట్లు వస్తుంటాయి. అక్కడ వాహనాన్ని ఆపి.. టోల్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో.. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్‌లో ఈ టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరుతాయి. దీనికి ముఖ్య కారణం టోల్ చెల్లింపు. అయితే ఈ టోల్ చెల్లింపు మాన్యువల్‌గా ఉండటంతో.. దాదాపు రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఒక్కోసారి.

అయితే ఈ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే.. ఎంచక్కా.. క్షణాల్లో పేమెంట్ చేసి వెళ్లిపోవచ్చు. ఎలాంటి లైన్‌లో వేచి ఉండాల్సిన పనిలేదు. అయితే ఈ ఫాస్ట్ ట్యాగ్‌ను మీ వాహనానికి ముందర అంటించి ఉంటుంది. ఈ ఫాస్ట్ ట్యాగ్‌.. అందులో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటికేషన్ ద్వారా పనిచేస్తుంది. మీ అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు.. అటోమెటిక్‌గా టోల్ గేట్ వద్ద అమౌంట్ కట్ చేసుకుని అది మిమ్మల్సి టోల్ గేటు నుంచి ముందుకు అనుమతిస్తుంది. అయితే దీని ద్వారా సమయం సేవ్ అవ్వడమే కాకుండా.. పలు రాయితీలను కూడా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే ఈ ఫాస్ట్ ట్యాగ్‌లను ప్రవేశపెట్టి దాదాపు రెండు మూడేళ్లు గడుస్తున్నా.. ఇంకా వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్‌ను ఉపయోగించకపోవడంతో.. కేంద్రం సీరియస్ అయ్యింది. ఇక వచ్చే డిసెంబర్ నెల నాటికి.. మీ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలని ఆదేశించింది. డిసెంబర్ నాటికి ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ట్యాగ్ లేని వాహనదారులకు.. టోల్ వద్ద రెట్టింపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు.. టోల్ చెల్లింపు కౌంటర్లను కుదించనున్నట్లు పేర్కొంది.

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..