ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం..
సంఘనా స్థలంలో 12 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, భవనంలో అక్రమంగా షూ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాన్పూర్ చమన్‌గంజ్ ప్రాంతంలో లెదర్ ఫ్యాక్టరీ ఉన్న ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమైన్నట్టుగా పోలీసులు వెల్లడించారు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ముందుజాగ్రత్తగా, సమీపంలోని భవనాలను ఖాళీ చేయించారు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Kanpur, UP | Kanpur Chief Fire Officer Deepak Sharma says, “Fire broke out in a six-storey building and is a leather factory…Efforts to douse the fire are underway…” https://t.co/4j1RTO7FDm pic.twitter.com/HeMt4qG12Q
— ANI (@ANI) May 4, 2025
సంఘనా స్థలంలో 12 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, భవనంలో అక్రమంగా షూ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Kanpur, UP | Fire broke out in a six-storey building in the Chaman Ganj area of the city. Efforts to douse the fire are underway. More details are awaited. pic.twitter.com/IY56UBqhtY
— ANI (@ANI) May 4, 2025
అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని కాన్పూర్ డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..